Vaccine: గేమ్‌ ఛేంజర్‌, కార్బెవాక్స్ వచ్చేస్తోంది!

17 Jun, 2021 13:05 IST|Sakshi

తక్కువ ధర, ఎక్కువ సమర్ధత!

‘గేమ్‌ ఛేంజర్‌’ కానున్న బయాలాజికల్-ఈ  వ్యాక్సిన్‌

90 శాతం సమర్దతత, తక్కువ ధర

రెండు  డోసుల విలువ సుమారు రూ.250

నోవావాక్స్ మాదిరిగానే అన్ని వేరియంట్లపైనా పనిచేస్తుంది

సాక్షి, న్యూఢిల్లీ: స్వదేశీ పరిజ్ఞానంతో హైదరాబాద్‌కు చెందిన బయాలాజికల్-ఈ సంస్థ తయారు చేస్తున్నకార్బెవాక్స్ వ్యాక్సిన్‌కు సంబంధించి మరో ఊరట లభించనుంది. దేశంలోనే అత్యంత సమర్ధతతో పాటు అత్యంత చౌకైన ధరకే ఈ వ్యాక్సిన్  లభించనుంది ఈ  మేడిన్‌ ఇండియా  కరోనా వ్యాక్సిన్ 90 శాతం ప్రభావాన్ని కలిగి ఉంటుందని , కరోనా  మహమ్మారిపై పోరాటంలో గేమ్‌ఛేంజర్‌గా ఉండనుందని భావిస్తున్నామని ప్రభుత్వసలహా ప్యానెల్‌ ఉన్నత సభ్యలొలకరు తెలిపారు.   

త్వరలోనే ఈ వ్యాక్సిన్‌ ఫేజ్ 3 ట్రయల్స్‌లోకి ప్రవేశిస్తోందని, అక్టోబర్ నాటికి అందుబాటులోకి రానుందని నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ (ఎన్‌టిఎజిఐ)  చైర్‌పర్సన్ ఎన్‌కె అరోరా తెలిపారు. నోవావాక్స్ వ్యాక్సిన్ మాదిరిగానే ఉందని, కార్బెవాక్స్ 90 శాతం సమర్ధతను ప్రదర్శించనుందని తెలిపారు. అలాగే ఈ వ్యాక్సిన్‌ కూడా  అన్నికోవిడ్‌-19 వేరియంట్లపై సమర్ధవంతంగా పనిచేస్తుందని తెలిపారు. అంతేకాదు భారీ సామర్థ్యాన్ని ప్రదర్శిస్తున​ ఈ టీకా రెండు మోతాదుల ధర గణనీయంగా తక్కువ ధరకే లభించనుందని చెప్పారు. సుమారు రూ. 250 వద్ద చాలా తక్కువ ధరకు అందు బాటులోకి రానుందని పేర్కొన్నారు. 

సరసమైన, సమర్థవంతమైన వ్యాక్సిన్ల కోసం ప్రపంచమంతా భారతదేశంపై ఆధారపడే  సమయం రానుందని  డాక్టర్ అరోరా అన్నారు. అంతిమంగా ప్రపంచం టీకాల కోసం మనపై ఆధారపడిఉంటుందన్నారు. ఈ సందర్భంగా ఆయన పూణేకు చెందిన సీరం, అహ్మదాబాద్‌కు చెందిన కాడిల్లా ఫార్మా లాంటి భారతీయ ఔషధ పరిశ్రమపై ప్రశంసలు కురిపించారు. టీకాల కోసం ప్రతి ఒక్కరూ భారతదేశంవైపు చూస్తున్నారు. ఎందుకంటే చాలా పేద దేశాలు, తక్కువ ఆదాయ దేశాలకు వేరే మార్గం లేదు. ఈ రోజు టీకాలు కొనడం కంటే ఆయుధాలు కొనడం చాలా సులభమని ఆయన వ్యాఖ్యానించారు.

చదవండి: 
Covaxin ఇంతకంటే ధర తగ్గించలేం: భారత్‌ బయోటెక్‌

Edible oil: వినియోగదారులకు భారీ ఊరట

మరిన్ని వార్తలు