Bipin Rawat Chopper Crash: ప్రతికూల వాతావరణమే కారణం

15 Jan, 2022 08:19 IST|Sakshi

సీడీఎస్‌ రావత్‌ హెలికాప్టర్‌ ఘటనపై ప్రాథమిక నివేదిక 

న్యూఢిల్లీ: మేఘావృతమైన ప్రతికూల వాతావరణంలోకి హఠాత్తుగా హెలికాప్టర్‌ ప్రవేశించడంతో.. అది పైలట్‌ అధీనంలో ఉన్నప్పటికీ దాని పథం మారి కిందకు దూసుకొచ్చి కూలిందని సీడీఎస్‌ రావత్‌ ఘటనపై త్రివిధ దళాల దర్యాప్తు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. దర్యాప్తులో వెల్లడైన ప్రాథమిక వివరాలు కోర్ట్‌ ఆఫ్‌ ఎంక్వైరీకి చేరాయని భారత వాయుసేన శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ముందుస్తు కుట్ర, ఉగ్రవాద దుశ్చర్చ, హెలికాప్టర్‌లో లోపాలు, పైలట్‌ తప్పిదం.. ఇలాంటి వాదనలు అన్నీ అవాస్తవం’ అని స్పష్టంచేసింది.

చదవండి: కోడలి నగలు భద్రపరచడం క్రూరత్వం కాదు

ఫ్లైట్‌ డాటా రికార్డర్, కాక్‌పిట్‌ వాయిస్‌ రికార్డర్‌లో నమోదైన సమాచారంతోపాటు ఘటనాస్థలిలో సేకరించిన సమాచారాన్ని పరిశీలించి ప్రాథమిక అంచనాకు వచ్చారు. చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్, ఆయన భార్య మధులికసహా 14 మంది ప్రయాణిస్తున్న భారత వాయుసేన హెలికాప్టర్‌ గత ఏడాది డిసెంబర్‌ ఎనిమిదిన కూనూర్‌లో నీలగిరి కొండల్లో నేలకూలిన విషయం తెల్సిందే.

మరిన్ని వార్తలు