పార్లమెంటరీ బోర్డును ప్రకటించిన బీజేపీ.. తెలంగాణ నుంచి అతనికే ఛాన్స్‌

17 Aug, 2022 15:06 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ బుధవారం కొత్త పార్లమెంటరీ బోర్డు, కేంద్ర ఎన్నికల కమిటీలను ప్రకటించింది. 11 మందితో పార్లమెంటరీ బోర్డు ఏర్పాటు చేయగా.. 15 మంది సభ్యులతో కేంద్ర ఎన్నికల కమిటీని బీజేపీ ప్రకటించింది. ఇక, తెలంగాణ నుంచి కె లక్ష్మణ్‌కు రెండు కమిటీల్లోనూ అవకాశం దక్కింది. 

బీజేపీ పార్లమెంటరీ బోర్డులో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, జేపీ, నడ్డా బీఎస్‌ యడ్యూరప్ప, సర్బానంద సోనోవాల్‌, కే లక్ష్మణ్‌, ఇక్బాల్‌ లాల్‌పుర, సుధా యాదవ్‌, సత్యనారాయణ జాతియా, బీఎల్‌ సంతోష్‌లను సభ్యులుగా నియమించింది. బీజేపీ పార్లమెంటరీ బోర్డును జేపీ నడ్డా నియమించారు. 

బీజేపీ పార్లమెంటరీ బోర్డులో ముగ్గురు కొత్త నేతలకు చోటు కల్పించారు. మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప, సర్బానంద సోనోవాల్, ఎంపీ కే లక్షణ్‌కు అవకాశం లభించింది. ఇక కొత్త పార్లమెంటరీ బోర్డులో కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ, మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహన్‌కు స్థానం దక్కలేదు.
చదవండి: మోదీగారు.. మహిళలంటే గౌరవం ఉంటే గనుక..!: కేటీఆర్‌

అదే విధంగా 15 మంది సభ్యులతో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీని కూడా ప్రకటించారు. ఈ కమిటీలోనూ కె లక్ష్మణ్‌కు చోటు లభించింది. దీనికి  జేపీ నడ్డా అధ్యక్షుడిగా కొనసాగనున్నారు.

>
మరిన్ని వార్తలు