బీజేపీ అధ్యక్షుడికి కరోనా పాజిటివ్‌

13 Dec, 2020 18:44 IST|Sakshi

న్యూఢిల్లీ: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (60) కరోనా బారినపడ్డారు. తనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు ఆయనే స్వయంగా ట్విటర్‌లో ఆదివారం సాయంత్రం వెల్లడించారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నానని, తన ఆరోగ్యం బాగానే ఉందని తెలిపారు. గత కొన్ని రోజులుగా తనను కలిసిన వారంతా కోవిడ్‌ పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. కాగా, ‘గెట్‌ వెల్‌ సూన్‌ సర్‌’ అంటూ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ట్వీట్‌ చేశారు. నడ్డా త్వరగా కోలుకోవాలని బీజేపీ నేతలు.. మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌, జ్యోతిరాదిత్య సింధియా ట్విటర్‌ వేదికగా ఆకాక్షించారు. ఇక పార్టీ సీనియర్‌ నేతలు హోంమంత్రి అమిత్‌ షా, కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప, మణిపూర్‌ సీఎం బిరేన్‌ సింగ్‌ గత నెలలో కరోనాబారినపడి కోలుకున్నారు. ఇదిలాఉండగా.. గత కొన్ని రోజులుగా దేశంలో కరోనా కేసులు తక్కువగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 30,254 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 98 లక్షల 50 వేలు దాటింది.
(చదవండి: ముగ్గురు ఐపీఎస్‌లపై కేంద్రం బదిలీ వేటు)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు