Rajya Sabha Result: బీజేపీకి బూస్ట్‌.. కాంగ్రెస్‌కు ఊహించని షాక్‌

11 Jun, 2022 15:16 IST|Sakshi

నాలుగు రాష్ట్రాల్లో 16 రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ భారీ విజయాన్ని అందుకుంది. మహారాష్ట్ర, కర్ణాటక, హర్యానాలో బీజేపీ సత్తా చాటగా.. రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ మూడు స్థానాల్లో విజయం సాధించింది. 

ఇదిలా ఉండగా.. హ‌ర్యానా రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌కు ఊహించని షాక్‌ త‌గిలింది. మాజీ మంత్రి అజ‌య్ మాకెన్ ఓటమిని చవిచూశారు. రెండు స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. బీజేపీ నుంచి కృష్ణలాల్‌ పన్వార్‌ విజయం సాధించగా.. స్వతంత్ర అభ్యర్థి కార్తికేయ శర్మ గెలుపొందారు. అజ‌య్ మాకెన్‌కు 29 ఓట్లు రాగా.. కార్తికేయ శ‌ర్మ‌ 29.6 ఓట్లు పోల‌య్యాయి. దీంతో కాంగ్రెస్‌ అభ్యర్థి ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కుల్దీప్ బిష్ణాయ్ క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారు. ఆయ‌న శ‌ర్మ‌కు ఓటేయ‌డంతో ఆ ఓటును అన‌ర్హ‌తగా ప్ర‌క‌టించారు. మ‌రో వైపు శ‌ర్మ‌కు బీజేపీ, జేజేపీ నుంచి మ‌ద్ద‌తు ల‌భించడంతో విజయాన్ని అందుకున్నారు.  

మరోవైపు.. మహారాష్ట్రలో శివసేన కూటమికి బిగ్‌ షాక్‌ తగిలింది. మహారాష్ట్రలో ఆరు స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. మూడు స్థానాల్లో బీజేపీ గెలుపొందింది. ఇక, నేషనలిస్ట్‌ పార్టీ(ఎన్సీపీ) నుంచి ప్రఫుల్‌ పటేల్‌, కాంగ్రెస్‌ నుంచి ఇమ్రాన్‌ ప్రతాప్‌ఘరీ, శివసేన నుంచి సంజయ్‌ రౌత్‌ విజయం సాధించారు. మరోవైపు.. బీజేపీ నుంచి కేంద్రమంత్రి పియూష్ గోయల్, అనిల్ బోండే, ధనంజయ్ మహాదిక్ ఎన్నికయ్యారు. మొత్తంగా 16 స్థానాలకు ఎన్నికలు జరుగగా.. బీజేపీ 8 స్థానాల్లో విజయాన్ని అందుకుంది. కాంగ్రెస్‌ 5 స్థానాల్లో గెలుపొందింది. 

ఇది కూడా చదవండి: రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ గెలుపు, ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేల క్రాస్‌ ఓటింగ్‌!

మరిన్ని వార్తలు