మంచైతే క్రెడిట్‌ తీసుకుంటారు, మరి..? రేపిస్ట్‌లతో పాటు తల్లిదండ్రులకూ శిక్ష పడాలన్న బీజేపీ ఎమ్మెల్యే

21 Nov, 2022 21:29 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

భోపాల్‌: దేశవ్యాప్తంగా ఈమధ్య వరుసగా ఘోర నేరాలు వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో చర్చ కూడా విస్తృత స్థాయిలో నడుస్తోంది. తాజాగా ఇలాంటి ఘటనలను ఉద్దేశించి బీజేపీ ఎమ్మెల్యే ఒకరు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతోంది. 

మధ్యప్రదేశ్‌ బీజేపీ నేత, ఇండోర్‌ ఎమ్మెల్యే ఆకాశ్‌ విజయ్‌వర్గీయా.. రేపిస్ట్‌, హంతకులను ఉద్దేశించి వ్యాఖ్యనించే క్రమంలో ఆసక్తికర కామెంట్‌ చేశాడు. వాళ్లతో(రేపిస్టులు, హంతకులు) పాటు వాళ్ల తల్లిదండ్రులు కూడా శిక్ష అనుభవించాల్సిందేనని డిమాండ్‌ చేశారాయన. వాళ్లలో అలాంటి నేర ప్రవృతి పెరగడానికి, వాళ్ల ప్రవర్తనకు తల్లిదండ్రులే కారణమని విమర్శించారాయన. 

బీజేపీ జాతీయ కార్యదర్శి కైలాష్‌ విజయ్‌వర్గీయా తనయుడు ఈ ఆకాశ్‌. ఆదివారం ఇండోర్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ‘‘అత్యాచారాలు చేస్తే ఆ వ్యక్తినే కాదు.. నా అభిప్రాయం అతని తల్లిదండ్రుల్ని కూడా ఒకటి రెండేళ్లు జైల్లో పడేయాలి. అలాగే హత్యలు చేసినప్పుడు కూడా నిందితుడితో పాటు రెండు మూడేళ్లు శిక్ష పడేలా చూడాలి. సమాజంలో బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత తల్లిదండ్రులది. మన సంప్రదాయాన్ని నేర్పించాల్సిన బాధ్యత కూడా ఉంది. మంచి చేసినప్పుడు.. ఆ క్రెడిట్‌ను తల్లిదండ్రులకు ఇచ్చినప్పుడు.. చెడు విషయంలోనూ అలాగే చేయాలి కదా అని వ్యాఖ్యానించారాయన. అయితే.. 

Video Credits: Times Now Navbharat

ఆయన వ్యాఖ్యలు ప్రముఖంగా రాజకీయ విమర్శలకు దారి తీయడంతో.. అది పూర్తిగా తన వ్యక్తిగత విషయమని, అవకాశం గనుక దొరికితే తాను ఆ చట్టం అమలు చేస్తానని ఆయన వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి: శివాజీపై వ్యాఖ్యల దుమారం.. బీజేపీ ఏమందంటే..

మరిన్ని వార్తలు