మమత మీద గౌరవం పోయింది.. క్షమాపణలు చెప్పాల్సిందే: కుష్బూ

15 Apr, 2022 19:27 IST|Sakshi

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ హన్స్‌ఖలీ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ అఘాయిత్యానికి పాల్పడింది అధికార టీఎంసీ నేత కొడుకే కారణమంటూ ఆరోపణలు వస్తుండగా.. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు మరింత కోపాన్ని తెప్పిస్తున్నాయి. ఈ తరుణంలో.. 

ఐదుగురు సభ్యులతో కూడిన బీజేపీ నిజనిర్ధారణ కమిటీ ఇవాళ(శుక్రవారం) హన్స్‌ఖలీలో పర్యటించింది. బాధిత కుటుంబాన్ని పర్యటించి.. పూర్తి వివరాలను సేకరించింది. చేసిన వ్యాఖ్యలకు సీఎం మమతా బెనర్జీ క్షమాపణ చెప్పాలని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది ఆ కమిటీ డిమాండ్ చేసింది. ఇక ఈ కమిటీలో సభ్యురాలైన బీజేపీ నాయకురాలు, సినీ నటి ఖుష్బూ మాట్లాడుతూ... ఈ హత్యాచారాన్ని పక్కదోవ పట్టించేందుకు మమతా బెనర్జీ దారుణమైన వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు.

ఆమె అత్యాచారానికి గురయిందా? లేదంటే ప్రేమ వ్యవహారం కారణమా? అనే విషయం ఆమె కుటుంబసభ్యులకు తెలుసు. ఒకవేళ వారు ప్రేమలో ఉంటే వారిని నేనెలా ఆపగలను?... సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు 

మరోవైపు  ఒక మహిళ అయివుండి కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు కుష్భూ. ఆడవాళ్లెవరూ అలా మాట్లాడరని, ఆమె మీద నమ్మకంతో అధికారం ఇచ్చిన ప్రజలను చిన్నచూపు చూస్తున్నారంటూ మండిపడ్డారు. ఇద్దరు బిడ్డల తల్లిగా బాధిత కుటుంబం ఆవేదనను, బాధను తాను అర్థం చేసుకోగలనని, మమతా బెనర్జీ చేసిన ప్రకటన పూర్తిగా క్రూరంగా ఉందని,  వెంటనే ఆమె క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు కుష్భూ. 

ఇదిలా ఉండగా.. బెంగాల్‌లో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందని, కాబట్టి రాష్ట్రపతి పాలన పెట్టాలని తాము కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నామని కుష్భూ అన్నారు. మరోవైపు ఈ ఘటనకు టీఎంసీ నేత కుమారుడే కారణమని భాదితురాలి కుటుంబం అంటోంది.

మరిన్ని వార్తలు