ప్రధాని నమ్మకంపై దెబ్బకొట్టాడు! ఇక అతనితో పొత్తు పెట్టుకోం!

30 Jan, 2023 12:58 IST|Sakshi

బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌పై ఆ రాష్ట్ర బిజేపీ చీఫ్‌ సంజయ్‌ జైస్వాల్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. అతనితో పోత్తుకు ఆస్కారమే లేదని కరాఖండీగా చెప్పారు. తమ కార్యకర్తలకు కూడా ఈ విషయా‍న్ని స్పష్టం చేసినట్లు చెప్పారు. నార్త్‌ బీహార్‌ జిల్లా దర్భంగాలో రెండు రోజుల పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ముగిసిన తదుపరి జైస్వాల్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. నితీష్‌కు ఒక పెండ్యులమ్‌ మాదిరి ఊగిసలాడే అలవాటు ఉందని ఎద్దేవా చేశారు. అతనికి మళ్లీ  మోసం చేసే అవకాశం ఇవ్వమని చెప్పారు.

బీజేపీతో పొత్తు పెట్టుకున్న నితీష్‌ పార్టీ జేడీయూ ఆ తదనంతరం అతని ఆర్జేడీ మహాఘట్‌బంధన్‌తో పోత్తు పెట్టుకుని ‍మరీ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. నితీశ్‌కు సరైన ప్రజాదరణ లేనందువల్లే 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కవ సంఖ్యలో సీట్లను గెలుపించుకోలేకపోయిందని అన్నారు. వాస్తవానికి ఆ ఎన్నికల్లో బీజేపీ ఏ అధిక స్థానాలను గెలుచుకుందన్నారు. కానీ ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానానికి కట్టుబడి ఉదారతను చూపిస్తే..కూమార్‌ మరోసారి సీఎం పదవిని చేపట్టి ఆస్వాదించగలిగారు.

ఐతే ఆయన తనకు అలవాటైన ద్రోహం అనే అస్త్రంతో తమ నమ్మకాన్ని వమ్ము చేశాడని ఆరోపణలు చేశారు. కాగా నితిశ్‌ కుమార్‌  మాజీ సన్నిహితుడు ఆర్‌సీపీ సాయంతో జేడీయూని చీల్చేందుకు యత్నిస్తుందంటూ బీజేపీని దుయ్యబట్టారన్నారు. అలాగే చిరాగ్‌ పాశ్వాన్‌ లోక్‌ జనశక్తి పార్టీ జేడీయూకి వ్యతిరేకంగా బీజేపీ పార్టీ తిరుగుబాటుదారులను నిలబెట్టి..అసెంబ్లీ ఎన్నికల్లో విధ్వంసానికి పాల్పడిందంటూ జేడీయూ పార్టీ ఆరోపణలు చేసిందన్నారు.

ఈ నేపథ్యంలో బీజేపీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలనే కృత లక్ష్యంతో ఉందని పునరుద్ఘాటించారు. అలాగే ఈరోజు నితీష్‌ గురువు జార్జ్‌ ఫెర్నాండెజ్‌ జన్మదినం. నిజానికి నితీశ్‌్‌ అతన్ని కూడా మోసం చేయడానికి వెనుకాడడు, ఎవరినైనా మోసం చేయగలడు అదే అతని నైజం అంటూ జైశ్వాల్‌ నితీశ్‌ విమర్శలతో విరుచుకుపడ్డారు.

(చదవండి: రాహుల్‌.. ప్రధాని మోదీ వల్లే అంత ప్రశాంతంగా జెండా ఎగరేశావ్‌!’)

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు