గెలిపిస్తే రూ.60కే లీటర్‌ పెట్రోల్‌: బీజేపీ

4 Mar, 2021 14:32 IST|Sakshi

సంచలన వ్యాఖ్యలు చేసిన కేరళ బీజేపీ నాయకుడు

తిరువనంతపురం: ఇంధన ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. పెట్రో, డీజిల్‌ ధరల పెంపుతో పాటు వంట గ్యాస్‌ ధరను కూడా భారీగా పెంచింది కేంద్ర ప్రభుత్వం. ఇటు వాహనాలు బయటకు తీయాలన్న.. అటు గ్యాస్‌ వెలిగించాలన్నా జంకుతున్నారు సామాన్యులు. ఈ క్రమంలో మరకొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కేరళలో బీజేపీ సంచలన ప్రకటన చేసింది. రాష్ట్రంలో తమను గెలిపిస్తే.. లీటర్‌ పెట్రోల్‌ 60 రూపాయలకే అందిస్తామని కేరళ బీజేపీ లీడర్ కుమ్మనం రాజశేఖరన్ ప్రచారం చేస్తున్నారు. అందులోనే జీఎస్టీ లాంటి ట్యాక్సులన్నీ లోబడే ఉంటాయని అంటున్నారు. పెట్రోల్, డీజిల్‌ను కూడా జీఎస్టీలోకి చేరుస్తామని హామీ ఇచ్చేశారు. ఎన్నికల సందర్భంగా కొచ్చిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజశేఖరన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

అంతేకాకుండా ఎల్డీఎఫ్‌ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌ని జీఎస్టీ ఫ్రేమ్‌లో ఎందుకు చేర్చలేదని రాజశేఖరన్‌ ప్రశ్నించారు. ఇది జాతీయ అంశం. దీన్ని లీడ్ చేయడానికి కొన్ని కారణమవుతున్నాయని ఆయన తెలిపారు. వివిధ కారణాల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరల్లో వ్యత్యాసం కనిపిస్తుంది అన్నారు. దీనిని ఎందుకు జీఎస్టీ కిందకు తీసుకురావడం లేదని ఆయన ప్రశ్నించారు. ఈ క్రమంలో కేరళలో ఒకవేళ బీజేపీ అధికారంలోకి వస్తే.. లీటర్‌ పెట్రోల్‌ 60 రూపాయలకే అందిస్తామని తెలిపారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని లెక్కించిన తర్వాత తనకు ఇది అర్థమైందని ఆయన చెప్పుకొచ్చారు.

రాజస్తాన్, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రల్లో అత్యధిక వ్యాట్ కారణంగా ఇప్పటికే లీటర్‌ పెట్రోల్‌ ధర 100 రూపాయల మార్కును దాటేసింది. ఇంధన ధరలు ఇంత భారీగా పెంచడం పట్ల ప్రతిపక్షాలు.. నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే ఉన్నాయి.

చదవండి:
మోదీకి చురక:‍ పెట్రోల్‌ ధరలపై బావమరుదుల భగ్గు
ఇంధన ధరలను కూడా అన్‌లాక్‌ చేశారేమో!

>
మరిన్ని వార్తలు