పొలిటికల్‌ హీట్‌: చిన్నమ్మతో ‘రాములమ్మ’ భేటీ 

29 May, 2022 07:18 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, చెన్నై: దివంగత సీఎం జయలలిత నెచ్చెలి శశికళతో తెలంగాణ బీజేపీ నేత, సినీ నటి విజయశాంతి భేటీ అయ్యారు. ఈ రహస్య భేటీ వివరాలు.. శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అన్నాడీఎంకే కైవసమే లక్ష్యంగా చిన్నమ్మ శశికళ వ్యూహాలకు పదును పెట్టిన విషయం తెలిసిందే. 

రెండు రోజుల క్రితం మీడియాతో మాట్లాడిన సందర్భంగా అన్నాడీఎంకే పగ్గాలు చేపట్టి తీరుతానన్న ధీమాను శశికళ వ్యక్తం చేశారు. అలాగే, అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కనీ్వనర్‌ పన్నీరు సెల్వం, కో– కన్వీనర్‌ పళనిస్వామి మధ్య సాగుతున్న అంతర్గాత విబేధాలను తనకు అనుకూలంగా మలచుకునే పనిలో పడ్డారు. ఇందుకు తగ్గట్టుగా ఆ ఇద్దరి మధ్య ఏకాభిప్రాయానికి అవకాశమే లేదంటూ కూడా శశికళ వ్యాఖ్యానించారు. అదే సమయంలో కేంద్రంలోని బీజేపీ పెద్దలకు దగ్గరయ్యే దిశగా పావులు కదుపుతున్నట్టు సమాచారం. 

ఈ పరిస్థితుల్లో చిన్నమ్మతో చెన్నైలో బీజేపీ నేత విజయశాంతి భేటీ కావడం ప్రాధాన్యతకు దారి తీసింది. రహస్యంగా ఈ భేటీ జరిగినట్టు చిన్నమ్మ శిబిరం వర్గాల ద్వారా శనివారం వెలుగులోకి వచ్చింది. గతంలో ఓ మారు చిన్నమ్మతో విజయశాంతి భేటీ బహిరంగానే చెన్నైలో జరిగింది. అయితే, తాజా భేటీ రహస్యంగా జరగడం చర్చనీయాంశంగా మారింది.  

ఇది కూడా చదవండి: గుజరాత్ ఫైల్స్‌ బ్లాక్ చేసి నన్ను ద్వేషించారు: ప్రధాని మోదీ

మరిన్ని వార్తలు