లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డ బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు

3 Mar, 2023 08:42 IST|Sakshi

బీజేపీ ఎమ్మెల్యే మాదాల్‌ విరూపాక్షప్ప కుమారుడు సుమారు రూ. 40 లక్షలు లంచం తీసుకుంటుండగా లోకాయుక్త అధికారులు అరెస్టు చేశారు. ఆయన కుమారుడు ప్రశాంత్‌ కుమార్‌ మైసూర్‌ శాండిల్‌​ సోప్‌ బ్రాండ్‌ను తయారు చేసే ప్రభుత్వ యజమాన్యంలోని కర్ణాటక సోప్స్‌ అండ్‌ డిటర్జెంట్‌ లిమిటెడ్‌(కేఎస్‌డీఎల్‌) కార్యాలయం నుంచి అరెస్టు చేశారు. లోకాయుక్త వర్గాల సమాచారం మేరకు బెంగళూరు వాటర్‌ సప్లై అండ్‌ సీవరేజ్‌ బోర్డు(బీడబ్ల్యూఎస్‌ఎస్‌బీ) చీప్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌గా ప్రశాంత్‌ కుమార్‌ పనిచేస్తున్నాడు.

అయితే అతన్ని మైసూర్‌ శాండల్‌ సోప్‌ బ్రాండ్‌ని తయారు చేసే ప్రభుత్వ యజమాన్యంలోని కేఎస్‌డీఎస్‌ కార్యాలయం నుంచి అరెస్టు చేశారు. ఆ కార్యాలయం నుంచి సుమారు మూడు బ్యాగుల నగదు లభించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఐతే ఆయన తండ్రి విరూపక్షప్ప దావణగెరె జిల్లా చన్నగిరి ఎమ్మెల్యే కేఎస్‌డీఎల్‌ చైర్మన్‌గా ఉండటం గమనార్హం.

ఈ ప్రశాంత్‌ కుమార్‌ 2008 బ్యాచ్‌ కర్ణాటక అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీసెస్‌ అధికారి. అతను సబ్బు, ఇతర డిటర్జెంట్లు తయారికీ అవసరమైన ముడిసరుకు కొనగోలు చేసే డీల్‌ కోసం ఓ కాంట్రాక్టర్‌ నుంచి లంచం తీసుకుంటుండగా ప‍ట్టుబడ్డారు. ఆ కాంట్రాక్టర్‌ నుంచి సుమారు రూ. 81 లక్షలు డిమాండ్‌ చేయడంతో లోకాయుక్తను ఆశ్రయించాడు. దీంతో అధికారులు సాయంత్రం 6 గంటలకు పకడ్బందిగా ఉచ్చు బిగించారు. ఐతే ఈ డబ్బు అందుకుంది తండ్రీకొడుకులని సీనియర్‌ లోకాయుక్త తెలిపారు. 

(చదవండి: ఢిల్లీలో అగ్ని ప్రమాదం.. రోబోల సాయంతో మంటలు అదుపులోకి.. )

మరిన్ని వార్తలు