బిహార్‌ సీఎం పై కీలక వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ

10 Aug, 2022 16:20 IST|Sakshi

పాట్నా: బీహార్‌ ముఖ్యమంత్రిగా ఎనిమిదోసారి ప్రమాణ స్వీకారం చేసిన నితీశ్‌ కుమార్‌ పై బీజేపీ ఎంపీ సుశీల్‌ కుమార్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను రాజ్యసభ ఎంపీగా పదివి చేపట్టక మునుపు తాను బిహార్‌ ఉప ముఖ్యమంత్రిగా పనిస్తున్న సమయంలో జేడీయు నాయకులు తన వద్దకు వచ్చి ఒక ప్రపోజల్‌ పెట్టారని అన్నారు. నితీష్‌ కుమార్‌ ఉపరాష్ట్రపతిగా ఢిల్లీ వెళ్లితే మీరు ముఖ్యమంత్రి అవుతారంటూ అదే జేడీయే నాయకులు ఒక పథకంతో తనను సంప్రదించారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఐతే నితీష్‌ కుమార్‌ తనకు ఆ ఉద్దేశం లేదని కొట్టిపారేశారు. కేవలం తాను బీజేపీ వ్యూహం నుంచి తన పార్టీని రక్షించుకునే నిమిత్తం ఇలా చేశానని చెప్పుకొచ్చారు. పైగా తాను గత నెలన్నర కాలం నుంచి మీడియాకి దూరంగా ఉన్నానని అన్నారు. మరోవైపు బీజేపీ ఎంపీ సుశీల్‌ కుమార్‌ మోదీ నితీష్‌ ఈ రోజు బీజేపీ ప్రజలను మోసం చేశారంటూ మండిపడ్డారు. బిహార్‌ ప్రజలు ప్రధాని నరేంద్ర మోదీని, బీజేపీని చూసి నమ్మి ఓటు వేస్తే ఇలా వెన్నుపోటు పొడిచే రాజకీయానికి తెరలేపారని ఆరోపించారు. తాను ఉపముఖ్యమంత్రి తేజస్వీయాదవ్‌తో  ఉన్న కొత్త బిహార్‌ ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో చూస్తానంటూ విమర్శలు ఎక్కుపెట్టారు.

కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో లోపే ఈ ప్రభుత్వం పడిపోతుందని అన్నారు. అయినా నితీష్‌ కుమార్‌ మహారాష్ట్రలా బిహార్‌ అవుతుందని భయపడ్డానని చెబుతున్నారు. కానీ బీజేపీ ఏమీ శివసేనను విభజించడానికి ప్రయత్నించలేదని చెప్పారు. అంతేకాదు లాలు ప్రసాద్‌ యాదవ్‌ అనారోగ్యాన్ని ఆసరాగా తీసుకుని ఆర్జేడియూని చీల్చడానికి ప్రయత్నిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఐతే ఈ విషయమే జేడీయూ లేదా ఆర్జేడియూ ఇంకా స్పందించలేదు.

(చదవండి: బీహార్‌ సీఎంగా ఎనిమిదో సారి నితీశ్‌ ప్రమాణం.. డిప్యూటీగా ఆర్జేడీ నేత తేజస్వి)

మరిన్ని వార్తలు