వుమెన్స్‌ డే: మెన్స్‌ డే కావాలని బీజేపీ మహిళా ఎంపీ డిమాండ్‌

8 Mar, 2021 19:38 IST|Sakshi

న్యూఢిల్లీ: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకొంటున్న నేపథ్యంలో పురుషుల కోసం కూడా ఓ రోజు ఉండాలని బీజేపీ మహిళా ఎంపీ సోనాల్‌ మాన్‌సింగ్‌ అన్నారు. పురుషులకు ‘మెన్స్‌ డే’ నిర్వహించాలని ఆమె డిమాండ్‌ చేశారు. సోమవారం రాజ్యసభలో ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. మహిళా దినోత్సవాన్ని ఇద్దరు జర్మన్‌ దేశానికి చెందిన మహిళలు ప్రారంభించారని తెలిపారు. ప్రపంచంలోనే ఎక్కడాలేని విధంగా తొలిసారి ఓ భారీ సముద్ర నౌకను మహిళలే పూర్తి స్థాయిలో​ సారథ్యం వహించటం మనదేశానికి గర్వకారణమని తెలిపారు. మహిళలు పోటీతత్వాన్ని పెంచుకోవాలని, అన్నిరంగాల్లో​ పురుషులతో సమానంగా రాణించాలని పేర్కొన్నారు.

కాగా, మహిళలను పురుషుల్లో సగభాగమని చెబుతున్నప్పటికీ కొన్నిచోట్ల మహిళలు తీవ్రమైన వివక్షతను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కరోనా సంక్షోభంలో పురుషులతో సమానంగా మహిళలు సేవలకు గుర్తింపుగా ఐక్యరాజ్య సమితి 2021వ ఏడాదిని ‘‘మహిళా నాయకత్వం, కోవిడ్‌–19 ప్రపంచంలో స్త్రీ, పురుషులు సమానంగా భవిష్యత్‌ నిర్మించుకోవడం’’అన్న థీమ్‌తో ఉత్సవాలను నిర్వహిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. 

చదవండి: పాకిస్తాన్‌లో హిందూ కుటుంబం దారుణ హత్య!

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు