పెగసస్‌పై ప్యానెల్‌ చర్చకు బీజేపీ మోకాలడ్డు

29 Jul, 2021 07:05 IST|Sakshi

న్యూఢిల్లీ: పెగసస్‌ స్పైవేర్‌ అంశంపై కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులను ప్రశ్నించేందుకు సిద్ధమైన పార్లమెంటరీ స్థాయీ సంఘం సమావేశానికి బీజేపీ ఎంపీలు ఆదిలోనే అడ్డుతగిలారు. పెగసస్‌ ఫోన్ల హ్యాకింగ్‌ ఉదంతం నేపథ్యంలో పౌరుల భద్రత, పరిరక్షణ అంశంపై చర్చించేందుకు కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ నేతృత్వంలోని ‘ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీపై పార్లమెంటరీ స్థాయీ కమిటీ’ బుధవారం పార్లమెంట్‌లో సమావేశమైంది. 32 సభ్యులున్న ఈ స్టాండింగ్‌ కమిటీలో ఎక్కువమంది బీజేపీ ఎంపీలు సభ్యులుగా ఉన్నారు. పెగసస్‌ అంశంపై చర్చకు నిరాకరించిన ఈ బీజేపీ ఎంపీలు సమావేశగదిలోకి వచ్చినా అక్కడి అటెండెన్స్‌ రిజిస్టర్‌లో సంతకాలు చేయలేదు. నిబంధనల ప్రకారం రిజిస్టర్‌లో సంతకాల సంఖ్యను లెక్కించే కనీస సభ్యుల సంఖ్య(కోరమ్‌) ఉందో లేదో లెక్కగడతారు. కోరమ్‌ ఉంటేనే ప్యానెల్‌ చర్చను మొదలుపెట్టాలి. కమిటీలో కోరమ్‌ లేని కారణంగా స్టాండింగ్‌ కమిటీ పెగసస్‌పై చర్చ సాధ్యంకాలేదు. 


 

మరిన్ని వార్తలు