నేను బీజేపీకి చెంది ఉండవచ్చు.. కానీ బీజేపీ నా పార్టీ కాదు..

1 Jun, 2023 20:39 IST|Sakshi

దివంగత బీజేపీ సీనియర్ నాయకులు గోపీనాథ్ ముండే కుమార్తె మాజీ మంత్రి బీజేపీ జాతీయ సెక్రెటరీ పంకజా ముండే ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ  నేను బీజేపీకి చెంది ఉండవచ్చు, కానీ అది నా పార్టీ కాదని వ్యాఖ్యలు చేశారు. పంకజా ముండే చేసిన ఈ  వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారి సొంత పార్టీలో ముసలం రేపుతున్నాయి.      

బీజేపీ నా పార్టీ కాదు... 
పంకజా ముండే  2014 నుండి 2019 మధ్య కాలంలో దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఆయన కేబినెట్లో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2019 అసెంబ్లీ ఎన్నికలలో ఆమె ఓటమిపాలైన నాటి నుండి ఆమె ప్రజల మధ్యకు రావడం తగ్గించేశారు. చాలా కాలం తర్వాత జనం ముందుకు వచ్చిన ఆమె ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. నేను బీజేపీకి చెంది ఉండవచ్చు,  అంతమాత్రాన అది నా పార్టీ కాదు. నాకు మా నాన్నతో సమస్య వస్తే, మా అన్న ఇంటికి వెళ్తాను. ఇది కూడా అంతే .." అని చాలా తేలికగా చెప్పి చిచ్చు రాజేశారు. 

అసలు కారణం ఇదే... 
అయితే గోపీనాథ్ ముండే అనుచరులు కొంతమంది మహాదే జాంకార్ నాయకత్వంలోని రాష్ట్రీయ సమాజ్ పక్ష పార్టీనుద్దేశించి ఆమె ఈ వ్యాఖ్యలు చేసినట్లు చెబుతున్నారు. 2022 లో ఎకనాథ్ షిండే ఫడ్నవీస్ ప్రభుత్వంలో ఆమెకు మంత్రి పదవి దక్కనందుకే ఆమె ఈ విధంగా స్పందించి ఉండొచ్చంటున్నారు.   

చదవండి: ఎట్టి పరిస్థితుల్లో బిల్లును అడ్డుకుంటాం... అరవింద్ కేజ్రీవాల్

మరిన్ని వార్తలు