President Elections 2022: ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిపై ఉత్కంఠ.. రేసులో బలంగా ఆ ఇద్దరు..?

21 Jun, 2022 17:19 IST|Sakshi

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి ఎవరనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. సాయంత్రం బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం కానుండగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో బీజేపీ అగ్రనేతలు భేటీ కావడం చర్చనీయాంశమైంది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో పాటు బీజేపీ చీఫ్‌ జేపీ నడ్డా వెంకయ్యనాయుడును కలిశారు. కాగా, ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రేసులో ఛత్తీస్‌ఘడ్‌ గవర్నర్‌ అనసూయ ఉయికే, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ధోవల్‌ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి.

మధ్యప్రదేశ్‌కు చెందిన అనసూయ ఉయికే గిరిజన సామాజిక వర్గానికి చెందినవారు. 2019 జూలై నుంచి ఛత్తీస్‌ఘడ్‌ గవర్నర్‌గా సేవలందిస్తున్నారు. అజిత్‌ ధోవల్‌ రాష్ట్రపతి అభ్యర్థి అయితే అనసూయ ఉయికే ఉపరాష్ట్రపతి అవుతారని తెలుస్తోంది. అలాగే ఉపరాష్ట్రపతి రేసులో రాజ్యసభ సభ్యుడు వినయ్‌ సహస్త్ర బుద్ధే పేరు కూడా వినిపిస్తోంది. కేంద్రమంత్రి ముఖ్తార్‌ అబ్బాస్ నఖ్వీ ఛత్తీస్‌ఘడ్‌ గవర్నర్‌గా వెళ్తారని సమాచారం.

చదవండి: (Yashwant Sinha: విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్‌ సిన్హా)

మరిన్ని వార్తలు