‘మహా కూటమితో బిహార్‌ అభివృద్ధి సాధ్యమేనా’

31 Oct, 2020 16:22 IST|Sakshi

పట్నా: భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా బిహార్‌ మహాకూటమిపై నిప్పులు చెరిగారు. మహాకూటమితో అభివృద్ధి జరగదని ఆయన అన్నారు. సోన్‌పూర్‌లో శనివారం జరిగిన ఎన్నికల సభలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్‌, ఆర్జేడీ కూటమిపై మండిపడ్డారు. అదేవిధంగా తమ పార్టీ చెప్పిన 1.9 మిలియన్ల జాబ్‌ వాగ్ధానాన్ని నిలబెట్టుకుంటామని చెప్పారు. ఆర్జేడీ ఏక ఛత్రాధిపత్య పార్టీ అని, కాంగ్రెస్‌ జాతి వ్యతిరేక  పార్టీ అన్న నడ్డా, వీటితో బిహార్‌ అభివృద్ధి సాధ్యమా అని ప్రశ్నించారు. అంతేకాకుండా మీకు దీపాలు లైట్లు కావాలా, ఎల్‌ఈడీ బల్బులు కావాలో మీరే తేల్చుకోవాలని అన్నారు. ఇక ఆర్టికల్‌ 370 గురించి మాట్లాడుతూ, ఒకసారి జవహర్‌లాల్‌ నెహ్రూ మాట్లాడుతూ కశ్మీర్‌ తన సొంతగా ఉంటుందన్నారు.

చాలా సంవత్సరాలు పాలనలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ఏం చేయలేకపోయిందని, కానీ ప్రధాని నరేంద్రమోదీ సహాసోపేతమైన నిర్ణయం తీసుకున్నానన్నారు. ప్రస్తుతం బిహార్‌లో ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. మొదటిదశ పోలింగ్‌ అక్టోబర్‌ 28న జరగగా, రెండోవిడత పోలింగ్‌ నవంబర్‌ 3, మూడో విడత పోలింగ్‌ నవంబర్‌ 7న జరగనుంది. ఇక ఈ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు నవంబర్‌ 10వ తేదీన తెలియనున్నాయి.  

చదవండి: నితీష్‌ స్కాం 30 వేలకోట్లు : మోదీ 

మరిన్ని వార్తలు