త్రిపురలో 54 మందితో బీజేపీ జాబితా

29 Jan, 2023 06:19 IST|Sakshi

న్యూఢిల్లీ: ఫిబ్రవరి 16న జరగనున్న త్రిపుర అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ 54 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ఇందులో కేంద్ర మంత్రి ప్రతిమా భౌమిక్‌ పేరు కూడా ఉన్నారు. ఆమె ధన్‌పూర్‌ నుంచి, సీఎం మాణిక్‌ సాహా బోర్డోవాలి నుంచి బరిలో దిగుతున్నారు.

ఇండిజినస్‌ పీపుల్స్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ త్రిపుర(ఐపీఎఫ్‌టీ)తో సీట్ల సర్దుబాటు ఖరారైందని సాహా చెప్పారు. బీజేపీ 55 చోట్ల, ఐపీఎఫ్‌టీ 5 స్థానాల్లో పోటీ చేస్తాయన్నారు. అసెంబ్లీలోని 60 సీట్లకు 2018 ఎన్నికల్లో బీజేపీ, ఐపీఎఫ్‌టీ 43 స్థానాలను గెలుచుకున్నాయి. మరోవైపు విపక్ష సీపీఎం, కాంగ్రెస్‌ కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి.

మరిన్ని వార్తలు