అయిదు రాష్ట్రాల ఎన్నికల ఖర్చు..

23 Sep, 2022 06:09 IST|Sakshi

బీజేపీ రూ. 344 కోట్లు, కాంగ్రెస్‌ రూ. 195 కోట్లు  

న్యూఢిల్లీ: ఎన్నికల ప్రచారానికి రాజకీయ పార్టీలు చేసే వ్యయం ఏడాదికేడాది తడిసిమోపెడవుతోంది. ఈ ఏడాది జరిగిన  అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో (ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్‌) బీజేపీ రూ.344.27 కోట్లు ఖర్చు చేసింది.2017లో ఈ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో చేసిన ఖర్చు కంటే ఇది 58% ఎక్కువ. అప్పట్లో బీజేపీ చేసిన ఖర్చు రూ.218.26 కోట్లుగా ఉంది.

ఎన్నికల సంఘానికి రాజకీయ పార్టీలు సమర్పించిన నివేదికల ప్రకారం కాంగ్రెస్‌ చేసిన వ్యయం ఏకంగా 80 శాతం పెరిగింది. 2017లో కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచారానికి 108.14 కోట్లు ఖర్చు చేయగా ఈ ఏడాది రూ.194.80 కోట్లు ఖర్చు పెట్టింది. ఇక బీజేపీ యూపీలో అత్యధికంగా రూ.221.32 కోట్లు ఖర్చు పెట్టగా, పంజాబ్, గోవాలలో ఖర్చు భారీగా పెరిగింది. కాగా కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రాల వారీగా ఎంత ఖర్చు చేసిందో వెల్లడించలేదు.

మరిన్ని వార్తలు