బెంగాల్‌లో హీటెక్కిన పాలిటిక్స్‌.. జేపీ నడ్డా టూర్‌పై టెన్షన్‌

8 Jun, 2022 16:08 IST|Sakshi

బెంగాల్‌లో బీజేపీ వర్సెస్‌ అధికార పార్టీ తృణముల్‌ కాంగ్రెస్‌ అన్నట్టు వాడివేడి పాలిటిక్స్‌ చోటుచేసుకుంటున్నాయి. ప్రతీ రోజు ఏదో ఒక వివాదంలో ఈ రెండు పార్టీల నేతలు ఘర్షణ వాతావరణం సృష్టిస్తున్నారు. తాజాగా బెంగాల్‌లో మరోసారి రాజకీయం వేడిక్కింది. 

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. బెంగాల్‌ పర్యటన ఉద్రిక్తతలకు దారి తీసేలా కనిపిస్తోంది. కాగా, జేపీ నడ్డా రెండు రోజుల పర్యటన నిమిత్తం బెంగాల్‌లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో అక్కడి బీజేపీ నేతలు.. కోల్‌కత్తాలోని నేషనల్ లైబ్రరీ ఆవరణలో బుధవారం సాయంత్రం రాజకీయ సమావేశం నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో, అక్కడ పొలిటికల్‌ సమావేశం పెట్టడంపై అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. 

ఈ సందర్భంగా టీఎంసీ నేత  జై ప్రకాష్ మజుందార్ మాట్లాడుతూ.. లైబ్రరీ నిబంధనల ప్రకారం ప్రాంగణాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడానికి అనుమతించడం లేదు. పొలిటికల్‌ సమావేశం కోసం అధికారులు అనుమతినివ్వడం ఇవ్వడమేంటని ప్రశ్నించారు. లైబ్రరీ వారసత్వ కట్టడం, కేంద్ర ప్రభుత్వంతో పర్యవేక్షణలో ఉన్న ప్రదేశమని గుర్తు చేశారు. ఇలాంటి ప్రదేశంలో రాజకీయ సమావేశాలు జరపడం సరికాదని తెలిపారు. 

ఇదిలా ఉండగా.. బెంగాల్‌లో బీజేపీకి ఇటీవల వరుస షాక్‌లు తగిలాయి. బీజేపీ నేతలు బాబుల్‌ సుప్రియో, అర్జున్‌ సింగ్‌.. అధికార టీఎంసీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో బెంగాల్‌పై ఫోకస్‌ పెట్టిన నడ్డా ఈ పర్యటనలో పార్టీ నేతలపై ఫుల్‌ ఫోకస్‌ పెట్టారు. 

ఇది కూడా చదవండి: ‘కాంగ్రెస్‌ చెడ్డీని ప్రజలెప్పుడో ఊడగొట్టారు’

మరిన్ని వార్తలు