Black Fungus: బెంగళూరులో ప్రమాద ఘంటికలు

16 Jun, 2021 14:16 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

వైరస్‌ తగ్గి.. ఫంగస్‌ పెరిగి 

బనశంకరి/కర్ణాటక: రాష్ట్రంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టినప్పటికీ బ్లాక్‌ ఫంగస్‌ రోగులు, మృతుల సంఖ్య పెరుగుతోంది. ఆదివారం నాటికి రాష్ట్రంలో 2,600 మందికి బ్లాక్‌ ఫంగస్‌ సోకగా, వీరిలో 127 మంది కోలుకున్నారు. 197 మంది మృత్యవాత పడ్డారు. మృతుల సంఖ్య ఎక్కువయ్యే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు పేర్కొన్నారు. ఈ బాధితులకు బెడ్లు, ఔషధాల కొరత వేధిస్తోంది. యాంఫోటెరిసిన్‌–బి టీకాలు పెద్దగా అందుబాటులో లేవు.  

బెంగళూరులో  ప్రమాదఘంటికలు  
బెంగళూరులో ఇప్పటివరకు 900 మంది బ్లాక్‌ ఫంగస్‌ బారినపడగా, 70 మంది మృతిచెందారు. కలబురిగిలో 146, బాగల్‌కోటే 97, బళ్లారి 88, బెళగావి 147, ధారవాడ 202, మైసూరు 93, రాయచూరు 81,  విజయపుర 99, చిత్రదుర్గ 99 మంది ఫంగస్‌లో చికిత్స పొందుతున్నారు. మిగతా జిల్లో 10– 20 మంది వరకూ బాధితులున్నారు.  

యాంఫోటెరిసిన్‌ కొరత  
రాష్ట్రంలో 9,700 వయల్స్‌ యాంఫోటెరిసిన్‌ టీకాల స్టాకు మాత్రమే ఉంది. రోగుల సంఖ్య ప్రకారమైతే నిత్యం 12 వేల వయల్స్‌ కావాలి. ఒకటీ అరా సూదులతో సరిపెడుతున్నట్లు సమాచారం. పూర్తిస్థాయిలో చికిత్స అందించాలంటే కనీసం లక్ష వయల్స్‌  కావాలని బ్లాక్‌ ఫంగస్‌ నిపుణుల కమిటీ సభ్యుడు ఒకరు తెలిపారు.  

చదవండి: బీపీఎల్‌ కుటుంబాలకు సాయం: సీఎం

మరిన్ని వార్తలు