పాల్ఘ‌ర్ కెమిక‌ల్ ఫ్యాక్ట‌రీలో పేలుడు

18 Aug, 2020 08:43 IST|Sakshi

పాల్ఘ‌ర్ : మ‌హారాష్ర్ట‌లోని పాల్ఘ‌ర్ జిల్లా తారాపూర్‌లోని ఓ కెమిక‌ల్ ఫ్యాక్ట‌రీలో జ‌రిగిన పేలుడు ధాటికి ఇద్ద‌రు కార్మికులు మ‌ర‌ణించారు. గ‌త‌రాత్రి జ‌రిగిన ఈ పేలుడు ఘ‌ట‌న‌లో మ‌రో న‌లుగ‌రు తీవ్రంగా గాయ‌ప‌డగా, ఆ స‌మ‌యంలో 20 మంది కార్మికులు ఫ్యాక్ట‌రీ లోప‌లే ఉన్న‌ట్లు తెలుస్తోంది.  వెంట‌నే రంగంలోకి దిగిన అగ్నిమాప‌క సిబ్బంది స‌హాయ‌క‌చ‌ర్య‌ల‌ను ముమ్మ‌రం చేయ‌డంతో ప్రాణ‌హాని త‌గ్గింద‌ని అధికారులు అంచ‌నా వేశారు.  క్ష‌త‌గాత్రుల‌ను వెంట‌నే ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. (ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టిన భద్రతా దళాలు)

 క‌ర్మాగారంలో సుగంధ ర‌సాయ‌నాలు, ఔష‌దాలును త‌యారుచేసి విదేశాల‌కు ఎగుమ‌తి చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. రియాక్ట‌ర్ పేలుడు శ‌బ్ధం దాదాపు 10 కిలోమీట‌ర్ల దాకా వినిపించింద‌ని స్థానికులు తెలిపారు. అయితే రియాక్ట‌ర్‌లో నీటి పీడనం పెరగడం వల్ల పేలుడు సంభవించిందని ప్లాంట్‌లోని సందీప్ సింగ్ అనే ఆపరేటర్  పోలీసులకు తెలిపారు. ఈ ఏడాది ఎంఐడిసి ప్రాంతంలో జ‌రిగిన రెండో పేలుడు ఇదేన‌ని అధికారులు తెలిపారు. కంపెనీ ఉప‌యోగించే కొన్ని ర‌సాయ‌నాలు ప్ర‌మాద‌క‌ర‌మైన‌విగా  గుర్తించారు. ఇదే యూనిట్‌లో గ‌తంలోనూ ప్ర‌మాదాలు జ‌రిగిన‌ట్లు పేర్కొన్నారు. ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసి విచార‌ణ చేప‌డుతున్న‌ట్లు వివ‌రించారు. (విచారణకు సిట్‌ ఏర్పాటు)

>
మరిన్ని వార్తలు