ఉమ్మితే పర్సు ఖాళీ.. రూ.1,200 జరిమానా 

2 Jun, 2021 20:48 IST|Sakshi

బీఎంసీ హెచ్చరిక 

ముంబై: ముంబైలోని బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేస్తే రూ.1200 జరిమానా విధించనున్నట్లు బీఎంసీ హెచ్చరించింది. కరోనా తీవ్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇంతకుముందు ఉమ్మితే రూ.200 గా ఉన్న జరిమానా ఇపుడు రూ.1,200కి పెంచారు. ఇటీవలె బీఎంసీ కమిషనర్‌ ఇక్బాల్‌ సింగ్‌ చాహల్‌ జరిమానా పెంపు నిర్ణయానికి ఆమోదం తెలిపారు. ఉత్తర్వులు జూన్‌ 1 నుంచి అమల్లోకి వస్తాయని బీఎంసీ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొంది. గత ఆరు నెలల్లో బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేసిన వ్యక్తుల నుంచి రూ.రూ. 28.67 లక్షల జరిమానా రూపంలో బీఎంసీ వసూలు చేసింది.

కేవలం సాకినాకల ప్రాంతంలోని ఎల్‌ వార్డు నుంచి రూ .4.70 లక్షలు జరిమానా వసూలు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేస్తే రూ.200 వసూలు చేస్తూ కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారి నుంచి రూ.1,200 వసూలు చేయడాన్ని హైకోర్టు బీఎంసీని ప్రశ్నించింది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు