పెట్రోల్‌, టైర్లతో దహనం.. ఐదుగురు పోలీసులపై వేటు

18 May, 2021 17:39 IST|Sakshi
పోలీసు అధికారి సమక్షంలో పెట్రోల్‌, టైర్లతో మృతదేహాలను దహనం చేస్తున్న దృశ్యం(ఫోటో కర్టెసీ:ఇండియా టుడే)

యూపీలో చోటు చేసుకున్న ఘటన

లక్నో: కరోనా మన జీవిన విధానాన్ని పూర్తిగా మార్చేసింది. సంబరాలు సంతోషాలు లేవు.. కనీసం నలుగురు మనుషుల కూడి దహన సంస్కారాలు చేయడానికి కూడా వీలు లేని పరిస్థితులు. మహమ్మారి భయంతో కోవిడ్‌తో మరణించిన వారి శవాలను అలాగే వదిలేసి వెళ్తున్నారు. కొద్ది రోజల క్రితం గంగా నదిలో పదుల కొద్ది శవాలు కొట్టుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీన్ని మరువక ముందే మరో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది.

కోవిడ్‌ మృతదేహాలను పోలీసులు రోడ్డు​ మీద అత్యంత అమానవీయ రీతిలో దహనం చేశారు. టైర్లు, పెట్రోల్‌ పోసి అంత్యక్రియలు నిర్వహించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తడంతో ఉన్నతాధికారులు ఇందుకు బాధ్యులైన ఐదుగురు పోలీసులును సస్పెండ్‌ చేశారు. ఈ సంఘటన బల్లియాలో మాల్దేపూర్ ఘాట్ వద్ద చోటు చేసుకుంది. 

రెండు రోజుల క్రితం నదిలో రెండు శవాలు కొట్టుకువచ్చాయి. పోలీసులకు సమాచారం అందిచడంతో వారు సంఘటన స్థలానికి చేరుకుని శవాలను బయటకు తీశారు. ఆ తర్వాత వాటిని దహనం చేయడానికి ఇంధనం లేకపోవడంతో టైర్లు వేసి.. పెట్రోల్‌ పోసి దహనం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరలయ్యింది. పోలీసు అధికారి సమక్షంలో ఈ సంఘటన చోటు చేసుకోవడంతో దీనిపై నెటిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఉన్నతాధికారులు ఐదుగురు పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు. సంఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు. 

చదవండి: ఎవరూ లేకున్నా.. కడసారి వీడ్కోలుకు ఆ నలుగురు

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు