అనధికార భవనాలను కూల్చేయండి! కీలక వ్యాఖ్యలు చేసిన హైకోర్టు

14 Jul, 2022 18:55 IST|Sakshi

ముంబై: అనధికార భవనాలు కారణంగా ఒక్క అమాయకుడి ప్రాణాలు పోయిన ఉరుకోమని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. అటువంటి నిర్మాణాల వల్ల కలిగే ప్రమాదాలను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు పేర్కొంది. ముంబైలో అనేక కుటుంబాలు నివశిస్తున్న తొమ్మిది అనధికార భవనాలను కూల్చివేయాలంటూ... ధానేకి చెందిన ముగ్గురు నివాశితులు పిటిషిన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే చీఫ్‌ జస్టీస్‌ దీపాంకర్‌ దత్తా, జస్టిస్‌ ఎంఎస్‌ కార్నిక్‌లతో కూడిన ధర్మాసనం విచారించిన సందర్భంగా ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. 1998 నాటి ప్రభుత్వ తీర్మానం ఇప్పటికీ అమలులో ఉందన్న విషయాన్ని ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తుచేసింది. అయినా వర్షాల సమయంలో అనధికార నిర్మాణాలను పౌర అధికారులు ఎందుకు కూల్చివేయడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

ఐతే థానే మునిసిపల్ కార్పొరేషన్ (టిఎంసీ) అనధికార నిర్మాణాలకు అనేక కూల్చివేత నోటీసులు అందించినప్పటికీ, నివాసితులు అక్కడ నివశిస్తున్నారని పిటిషనర్ల తరుపు న్యాయవాది నీతా కర్ణిక్‌ పేర్కొన్నారు. ఈ మేరకు టీఎంసీ తరుఫు న్యాయవాది రామ్ ఆప్టే, తొమ్మిది భవనాలను కూల్చివేతలకు పౌర సంఘం అనేక నోటీసులు పంపిందని, అయితే నివాసితులు ఖాళీ చేయడానికి నిరాకరించారని ధర్మాసనానికి తెలిపారు. ఇదిలా ఉండగా సంబంధిత భవనాల తరుఫు న్యాయవాది సుహాస్ ఓక్ మానవతా దృక్పథంతో వ్యవహరించి కనీసం వర్షాకాలం ముగిసే వరకు భవనాలను కూల్చివేయకుండా టీఎంసీని ఆపాలని కోర్టును కోరారు.

దీనికి ప్రతి స్పందనగా ధర్మాసనం ..." మేము మానవతా దృక్పథంతో వ్యవహరించే అనధికారిక భవనాల వల్ల ఒక్క అమాయకుడి ప్రాణం పోకూడదని అనుకుంటున్నాం. వారంతా సురక్షిత ప్రదేశంలో ఉండాలని ఆశిస్తున్నాం. అంతేకాదు ఒక్క భవనం కూలిపోతే అనేక ప్రాణాలు పోవడమే కాదు, పక్కనున్న భవనాలను కూడా నేలమట్టం చేయవచ్చు అని  వెల్లడించింది.

అదీగాక డిసెంబరు 2021లోనే ఈ కేసుని సుమోటాగా తీసుకుంటూ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ భూముల్లో ఉన్న అనధికార భవనాలన్నింటినీ కూల్చివేయాలని..ఒక ఉత్తర్వును కూడా జారీ చేసినట్లు ధర్మాసనం పేర్కొంది. అయినప్పటికీ నివాసితులు దీన్ని అర్థం చేసుకోవడం లేదంటూ చివాట్లు పెట్టింది. 

అంతేకాదు సంబంధిత భవనాల్లో ఉంటున్న నివాసితులందరూ ఆగస్టు 31లోగా ఖాళీ చేస్తామని హామీ ఇవ్వాలని కూడా స్పష్టం చేసింది. మరోవైపు టీఎంసీని కూడా ఆగస్టు 31 దాక భవనాలను కూల్చివేయద్దని ధర్మాసనం ఆదేశించింది. సాధ్యమైనంతవరకు ఈ ఉత్తర్వును త్వరితగతిన అమలు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఐతే ఇలాంటి అనధికార భవనాలు ముంబైలో సుమారు 30 దాక ఉన్నట్లు సమాచారం.

(చదవండి: ఆ కారు రిజిస్ట్రేషన్‌ నెంబర్‌ చూసి షాక్‌ అయిన పోలీసులు: ఫోటోలు వైరల్‌)
 

మరిన్ని వార్తలు