బీజేపీ ఎంపీ అర్జున్‌ సింగ్‌ నివాసం వద్ద బాంబు పేలుడు

8 Sep, 2021 11:06 IST|Sakshi

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో బీజేపీ ఎంపీ అర్జున్‌ సింగ్‌ నివాసం సమీపంలో బాలు పేలుడు సంభవించింది. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని అర్జున్‌ సింగ్‌ నివాసం సమీపంలో బుధవారం ఉదయం మూడు బాంబాలు విసిరినట్లు తెలుస్తోంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సెర్చ్‌ ఆపరేషన్‌ చేపట్టారు. అలాగే ఈ ఘటనకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ బాంబు దాడి వెనక టీఎంసీకి చెందిన వారున్నారని బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ ఆరోపించారు.

కాగా ఈ పేలుడు ఘటన జరిగిన సమయంలో ఎంపీ అర్జున్‌ సింగ్‌ ఢిల్లీలో ఉన్నట్లు సమాచారం. ఆయన కుటుంబ సభ్యులు మాత్రం దాడి జరిగిన ఇంటి లోపలే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు వారికి ఎలాంటి గాయాలైనట్లు సమాచారం లేదు. మరోవైపు బాంబు పేలుడు ఘటనను బెంగాల్‌ గవర్నర్‌ జగ్‌దీప్‌ ధన్‌కఢ్‌ ఖండించారు. బెంగాల్‌లో శాంతి భద్రతలు ఆందోళనకరంగా ఉన్నాయని ఆయన అన్నారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు