ఐదేళ్లుగా చాకిరీ, ప్రాణం పోతున్నా వినలేదు!

26 Sep, 2020 20:27 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

భోపాల్‌: వెట్టి చాకిరీకి కాలం చెల్లినా దేశంలోని చాలా చోట్ల ఇంకా ఈ దోపిడీ వ్యవస్థ కొనసాగుతోంది. పూటగడవక ఇబ్బందుల్లో ఉన్నవారికి కొంత మొత్తం ముట్టజెప్పి.. ఆ మొత్తం తిరిగి చెల్లించేవరకు ఎలాంటి వేతనం ఇవ్వకుండా చాకిరీ చేయించుకునే విధానం (బాండెడ్‌ లేబర్‌) మధ్యప్రదేశ్‌లో తాజాగా వెలుగు చూసింది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న తమ బిడ్డను ఆస్పత్రికి తీసుకెళ్లాలని ఆ తల్లిదండ్రులు ఎంత వేడుకున్నా యజమాని కనికరించలేదు. దీంతో వైద్యం అందక ఎనిమిదేళ్ల బాలుడు ప్రాణాలు విడిచాడు. గుణాలో గత ఆదివారం ఈ అమానుష ఘటన చోటుచేసుకుంది.

వివరాలు.. పహల్వాన్‌ సింగ్‌ అనే వ్యక్తి ఎగువ తరగతికి చెందిన ఓ వ్యక్తి వద్ద ఐదేళ్ల కిత్రం రూ.25 వేలు అప్పుగా తీసుకున్నాడు. వాటిని తిరిగి చెల్లించేవరకు తన పంట పొలంలో పనిచేయాలని అప్పు ఇచ్చిన వ్యక్తి కాగితాలపై సంతకాలు తీసుకున్నాడు. బాకీ చెల్లించేవరకు వారికి రూపాయి కూడా ఇవ్వనని ఒప్పందం చేసుకున్నాడు. ఇక అప్పటినుంచి పవహల్వాన్‌ సింగ్‌ కుటుంబం పనిచేస్తూనే ఉంది. ఈక్రమంలో వారం కిత్రం అతని కుమారుల్లో ఒకరు (8) అనారోగ్యం బారినడపడ్డాడు. చిన్నారిని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు యజమానిని డబ్బులు అడగ్గా.. పవహల్వాన్‌ సింగ్‌పై దాడి చేశాడు.
(చదవండి: ముగ్గుర్ని చంపి, శవాలతో శృంగారం)

అదేసమయంలో పరిస్థితి విషమించడంతో చిన్నారి ప్రాణాలు విడిచాడు. కాగా, బాధితుడి ఫిర్యాదు మేరకు ఎస్సీఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. వెట్టిచాకిరీ చేయించుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ వ్యవస్థను రూపుమాపేందుకు కేంద్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టాలని అభిప్రాయపడ్డారు. గుణ ప్రాంతంలో వెట్టి బతుకులపై ఆరా తీసుతీసున్నామని వెల్లడించారు. పహల్వాన్‌ సింగ్‌ మరో ఇద్దరు పిల్లలు కూడా మలేరియాతో బాధపడుతున్నారని, వారిని ఆస్పత్రిలో చేర్పించామని తెలిపారు. 
(చదవండి: తప్పు ఒప్పుకుంటున్నా, మాస్క్‌ పెట్టుకుంటా)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా