చైనాతో ఘర్షణలు కొనసాగుతూనే ఉంటాయ్‌

1 Oct, 2021 05:06 IST|Sakshi

దీర్ఘకాలిక ఒప్పందం కుదరాలి: ఆర్మీ చీఫ్‌

న్యూఢిల్లీ:  భారత్, చైనా మధ్య ఒక ఒప్పందం కుదిరే వరకు సరహద్దుల్లో ఘర్షణలు కొనసాగుతూనే ఉంటాయని ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఎంఎం నరవణె వ్యాఖ్యానించారు. డ్రాగన్‌ దేశం ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడినా గతంలో మాదిరిగా బుద్ధి చెప్పడానికి మన సైన్యం సన్నద్ధంగా ఉందన్నారు. గురువారం పీహెచ్‌డీ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ వార్షిక సదస్సులో పాల్గొన్న నరవణె మాట్లాడారు. అఫ్గానిస్తాన్‌లో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలతో ఏర్పడే ముప్పుపై దృష్టి సారించామని చెప్పారు. దానికనుగుణంగా వ్యూహాలను రచిస్తున్నట్టుగా తెలిపారు.

>
మరిన్ని వార్తలు