గడ్డకట్టే చలిలో 1500 అడుగుల ఎత్తులో జాతీయ జెండా ఆవిష్కరణ

26 Jan, 2022 12:10 IST|Sakshi

భారతదేశం 73వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) సిబ్బంది బుధవారం మంచుతో కప్పబడిన లడఖ్ సరిహద్దుల్లో జాతీయ జెండాను ఎగరువేసింది. దాదాపు మైనస్ 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో 15000 అడుగుల ఎత్తులో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ మేరకు భారత్‌లో వివిధ సరిహద్దు ప్రాంతాల్లో గస్తీ కాస్తున్న జవాన్లు జాతీయ జెండాను ఆవిష్కరించారు.

అంతేకాదు వాటికి సంబంధించిన ఫోటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. అయితే సైనికులు గడ్డకట్టే చలిలో ధైర్యంగా ఎలా ఎదుర్కొంటున్నారో కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఆ సైనికులను ఇండో టిబెటన్‌ హిమవీర్స్‌ అని కూడా పిలుస్తారు. సైనిక సిబ్బంది భారత్‌ మాతాకి జై, వందేమాతరం అంటూ గ‍ట్టిగా నినాదాలు చేశారు. ఈ మేరకు 73వ గణతంత్ర వేడుకలకు యావత్​ భారతావని సిద్ధమైంది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గౌరవ వందనంతో రాజ్​పథ్​ వద్ద రిపబ్లిక్​ డే పరేడ్ ప్రారంభమైంది. దేశ సామార్థ్యాన్ని, గౌరవాన్ని, సాంస్కృతిని చాటి చెప్పేలా కవాతు ప్రదర్శన, శకటాల ప్రదర్శన వంటి వివిధ కార్యక్రమాలు నిర్వహించింది.

మరిన్ని వార్తలు