పార్లమెంటు ఉభయ సభలు నిరవధిక వాయిదా

7 Apr, 2022 11:51 IST|Sakshi

న్యూఢిల్లీ: పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు షెడ్యూల్‌ కంటే ఒక రోజు ముందే ముగిసిపోయాయి. పార్లమెంటు ఉభయ సభలు గురువారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. రెండో విడత బడ్జెట్‌ సమావేశాలు మార్చి 14న మొదలై షెడ్యూల్‌ ప్రకారం ఏప్రిల్‌ 8 శుక్రవారం వరకు జరగాల్సి ఉండగా ఒకరోజే ముందే ముగిశాయి.  ఈసారి బడ్జెట్‌ ఆమోదంతో పాటు కీలక బిల్లులైన ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (సవరణ) బిల్లు, క్రిమినల్‌ ప్రొసీజర్‌ (ఐడెంటిఫికేషన్‌) బిల్లులకి పార్లమెంటు ఆమోద ముద్ర వేసింది.

మరిన్ని వార్తలు