ట్రైన్‌ జర్నీలో యువకుడి డేంజరస్‌ ఫీట్లు.. ఒళ్లు గగుర్పుడిచే దృశ్యాలు

16 Sep, 2021 17:38 IST|Sakshi

ముంబై: యువత తమ నైపుణ్యాలను, సాహసాలను ప్రదర్శించేందుకు అత్యుత్సాహం ప్రదర్శిస్తుంటారు. సమయం చిక్కినప్పుడల్లా స్టంట్‌లు, విన్యాసాలు ప్రయత్నిస్తుంటారు. బైక్‌, కారు, రైల్లో ప్రయాణం చేసేటప్పుడు అస్సలు కుదురుగా ఉండరు. హద్దు మీరి సాహసాలు చేసి ప్రాణాలను కోల్పోతున్నారు. ఈ క్రమంలో ముంబై లోకల్‌ రైలులో ఓ యువకుడు చేసిన విన్యాసాల వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. వాస్తవానికి ఇది 2015లో చోటుచేసుకోగా తాజాగా ఓ మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఇందులో ప్రమాదకరమని తెలిసినా కదులుతున్న రైలు డోర్‌ వద్ద తన స్నేహితులతో కలిసి నిలబడిన ఓ యువకుడు విన్యాసాలు చేశాడు.

ముందుగా రైలు వెనక నుంచి పరుగెత్తకుంటూ వచ్చి రైలు ఎక్కాడు. తరువాత ట్రైన్‌ డోర్‌ హ్యాండిల్‌ను పట్టుకొని మరోవైపు ఊగుతూ కనిపిస్తున్నాడు. అంతటితో ఆగకుండా పదేపదే కిందకు మీదకు దూకడం, దారిలో వచ్చే స్తంభాలను తాకుతూ డేంజరస్‌ ఫీట్లు చేశాడు. మధ్యలో రైలు నుంచి దూకి గోడపై నడిచి మళ్లీ రైలులోకి రావడం చేశాడు. ఇదంతా తన స్నేహితులతో వీడియో తీయించి సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. దీనిని చూసిన నెటిజన్లు యువకుడి అజాగ్రతను చూసి షాక్‌కు గురవుతున్నారు. ఇలాంటి విన్యాసాలు చేయడం చాలా ప్రమాదకరమని, స్టంట్‌ ప్రయత్నాలు చేసే సమయంలో గాయలు, ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
చదవండి: షాకింగ్‌: ఇద్దరు విద్యార్థుల బ్యాంక్‌ అకౌంట్లలో ఏకంగా రూ. 900 కోట్లు జమ!
వైరల్‌: బాబోయ్‌.. బైకుపై 13 మంది.. ఏంటీ వెర్రి పని!

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు