ఇద్దరు పిల్లల కాళ్లను గోలుసులతో కట్టేసి తాళం.. ఆ తర్వాత.. 

28 May, 2022 09:32 IST|Sakshi

ఇద్దరు పిల్లలను గొలుసులతో కట్టేసి, తాళం పెట్టి వారిని తీవ్రంగా కొట్టారు. ఎలాగోలా వారు అక‍్కడి నుంచి తప్పించుకుని పేరెంట్స్‌ వద్దకు చేరుకున్నారు. వారి పరిస్థితి చూసి ఆవేదన వ్యక్తం చేసిన తల్లిదండ్రులు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. 

వివరాల ప్రకారం..  లక్నో స‌మీపంలో గోసైంగంజ్ శివలార్‌లో ఉన్న సుఫమ్‌దింతుల్ ఉలమా మదర్సాలోని మౌలానా ఇద్దరు పిల్ల‌ల‌ను ఇనుప గొలుసుల‌తో క‌ట్టేశాడు. వారిలో ఒక విద్యార్థి గోసైంగంజ్ రాణిమౌ నివాసి అయిన షేరా కుమారుడు షాబాజ్ కాగా.. మ‌రో విద్యార్థి, బారాబంకి జర్మావు నివాసి రాజు. అయితే, వీరిద్దరినీ గొలుసుల‌తో క‌ట్టివేడ‌యంతో ఏడుస్తూ బ‌య‌ట‌కు ప‌రుగులు తీశారు. దీంతో రోడ్డుమీద వీరిని చూసిన స్థానికులు పిల్లలను ఆపి విషయం తెలుసుకున్నారు. ఈ క్రమంలో వీరిద్దరినీ వెంటనే గోసైంగంజ్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. 

స్టేషన్‌లో పోలీసు అధికారి శైలైంద్ర గిరి.. పిల్లలను అడిగి విషయం తెలుసుకున్నారు. మదర్సా ఉపాధ్యాయులు తమను బెత్తంతో కొట్టారని, కాళ్లను గొలుసుతో క‌ట్టేశార‌ని విద్యార్థులు ఆరోపించారు. అనంతరం ఈ స‌మాచారాన్ని షాబాజ్ తండ్రి షేరాకు చేర‌వేశారు. స్టేషన్‌కు వచ్చిన షేరా.. గతంలో కూడా త‌మ బిడ్డ రెండు సార్లు మదర్సా నుంచి పారిపోయాడ‌ని తెలిపారు. షాబాజ్‌కు చదువు రాదని షేరా పోలీసులకు చెప్పారు. షాబాజ్‌కు చదువు నేర్పించేదుకే వారు ఇలా కొట్టారని పేర్కొన్నారు. షాబాజ్ త‌మ మాట విన‌డ‌ని అందుకే ఉపాధ్యాయులే అతడికి బుద్దిచెప్పాలని తాము కోరినట్టు వివరించారు. షాబాజ్‌కు ఇష్టం లేకున్నా మ‌ద‌ర్సాకు పంపించామ‌ని అన్నారు. ఈ సందర్బంగానే మ‌ద‌ర్సా ఉపాధ్యాయుడిపై ఎలాంటి చ‌ర్య‌లూ తీసుకోకూడ‌ద‌ని లిఖిత‌పూర్వంగా ఆయ‌న పోలీసు స్టేష‌న్‌లో నోట్‌ రాసి ఇచ్చారు. 

ఇది కూడా చదవండి: పెళ్లికి వెళ్తుండగా మృత్యుపంజా

మరిన్ని వార్తలు