బీఎస్పీ పిటిషన్‌ను తోసిపుచ్చిన హైకోర్టు

6 Aug, 2020 15:24 IST|Sakshi

గహ్లోత్‌కు తప్పిన తలపోటు

జైపూర్‌ : రాజస్తాన్‌లో రాజకీయ హైడ్రామా కొనసాగుతోంది. పాలక కాంగ్రెస్‌లో ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేల విలీన ప్రక్రియను నిలిపివేయాలని బీఎస్పీ దాఖలు చేసిన పిటిషన్‌ను రాజస్తాన్‌ హైకోర్టు కొట్టివేయడంతో అశోక్‌ గహ్లోత్‌ సారథ్యంలోని కాంగ్రెస్‌ సర్కార్‌కు ఊరట లభించింది. సచిన్‌ పైలట్‌ సహా 19 మంది రెబెల్‌ ఎమ్మెల్యేల తిరుగుబాటుతో అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకునేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న గహ్లోత్‌ సర్కార్‌కు ఈ పరిణామం భారీ ఊరటగా భావిస్తున్నారు. రాజస్తాన్‌ అసెంబ్లీలో మెజారిటీ మార్క్‌కు ఒక్కరు అధికంగా తనకు 102 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని గహ్లోత్‌ చెబుతున్నారు.

బీఎస్పీ ఎమ్మెల్యేల విలీనం నిలిపివేస్తే గహ్లోత్‌ మద్దతుదారుల సంఖ్యాబలం 102 నుంచి 96కు పడిపోయి మెజారిటీ నిరూపణకు ఆయన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేది. 200 మంది సభ్యులతో కూడిన రాజస్తాన్‌ అసెంబ్లీలో బీజేపీకి 72 మంది ఎమ్మెల్యేలు ఉండగా, ముగ్గురు ఇండిపెండెంట్‌ ఎమ్మెల్యేలు, తిరుగుబాటు ఎమ్మెల్యేలతో కలుపుకుని ప్రత్యర్థి వర్గానికి 97 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. 2019 సెప్టెంబర్‌లో కాంగ్రెస్‌లో ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేల విలీనాన్ని సవాల్‌ చేస్తూ బీఎస్పీ, బీజేపీలు కోర్టును ఆశ్రయించాయి. సభా కార్యకలాపాల్లో ఆరుగురు ఎమ్మెల్యేలను పాల్గొనకుండా స్టే విధించాలని ఆ పార్టీలు కోరుతున్నాయి. చదవండి : ‘గహ్లోత్‌ ఆనందం ఆవిరే’

మరిన్ని వార్తలు