ఇష్టపడిన వ్యక్తితో కోర్టులో వివాహం.. వన్‌ సెకన్‌!

27 Jul, 2020 08:25 IST|Sakshi

భోపాల్‌ : తనకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకోవాలనుకున్న ఓ యువతికి చివరి క్షణంలో కుటుంబ సభ్యులు షాకిచ్చారు. ఈ విచిత్ర సంఘటన మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో ఆదివారం చోటుచేసుకుంది. 22 ఏళ్ల యువతి తమ కులానికే చెందిన యువకుడిని ఇష్టపడింది. పెళ్లికి అబ్బాయి కుటుంబ సభ్యులు అంగీకరించినప్పటికీ యువతి తల్లిదండ్రులు నిరాకరించారు. దీంతో ప్రేమికులు ఇద్దరూ కోర్టులో రిజిస్టర్‌ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. యువకుడు తన కుటుంబంతో కలిసి యువతిని పెళ్లి చేసుకునేందుకు ఆదివారం ఖాండ్వాలోని కోర్టుకు చేరుకున్నారు. (‘ఓ ఇంటివాడినయ్యా.. దీవించండి’)

కాగా వివాహన్ని రిజిస్టర్‌ చేస్తున్న సమయంలో అనూహ్యంగా యువతి తల్లిదండ్రులు కోర్టుకు చేరుకొని వధువుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వెల్లడించారు.  ఇది విన్న యువకుని కుటుంబం వరుడిని క్వారంటైన్‌కు తీసుకెళ్లేందుకు యత్నించారు. అంతేగాక కోర్టులోని న్యాయవాది సైతం టైప్‌ చేయడానికి నిరాకరించి యువతి నుంచి దూరంగా పారిపోయారు. వెంటనే యువతికి కరోనా పరీక్ష నిర్వహించాలని, ఆ తరువాత పెళ్లి చేయించాలని న్యాయవాది కోరారు. మరోవైపు జిల్లా ఆరోగ్యశాఖ అధికారుల  కథనం ప్రకారం యువతికి కరోనా సోకినట్లు తమకేమీ నివేదికలు అందలేదని పేర్కొన్నారు. ఇక తమ కూతురు ప్రేమ పెళ్లి ఇష్టం లేని కారణంగానే యువతి తల్లిదండ్రులు కోర్టులో నానా హంగామా సృష్టించారని తెలిపారు. (మధ్యప్రదేశ్‌ సీఎం‌కు కరోనా పాజిటివ్‌)

మరిన్ని వార్తలు