గుండెపోటుతో కుప్పకూలిన వధువు; శవాన్ని పక్కనే ఉంచి.. చెల్లెలితో పెళ్లి

29 May, 2021 10:28 IST|Sakshi
ఫొటో కర్టెసీ: ఇండియా.కామ్‌

పెళ్లిలో విషాదం 

పెళ్లి పీఠ‌ల‌పై కుప్ప‌కూలిన పెళ్లి కుమార్తె

వ‌రుడికి బాధితురాలి చెల్లెలితో వివాహం

ల‌క్నో: మరో ఐదునిమిషాల్లో పెళ్లి. మంగళ వాయిద్యాల్ని సిద్ధం చేశారు. చుట్టాలు, అతిథుల‌తో  పండ‌గ వాతావ‌ర‌ణం నెల‌కొంది. బాజాభ‌జంత్రీల న‌డుమ కాబోయే దంప‌తుల్ని ఆశీర్వదించేందుకు పెళ్లి పెద్ద‌లు సిద్ధ‌మ‌య్యారు. కానీ అంత‌లోనే విషాదం. పెళ్లి పందింట్లో పెళ్లికొడుకు ఒడిలోనే  వ‌ధువు త‌నువు చాలించింది. దీంతో పెళ్లి మండపంలో పెళ్లి కుమార్తె మృతదేహాన్ని ఉంచి.. వ‌రుడికి బాధితురాలి చెల్లెలితో వివాహం జ‌రిపించారు. 

పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. ఉత్త‌ర్ ప్ర‌దేశ్ రాష్ట్రం ఎటావా జిల్లాలో  పెళ్లి కొడుకు మంజేష్ పెళ్లి కుమార్తె సుర‌భి మెడ‌లో తాళిక‌ట్టాల్సి ఉంది. అదే స‌మ‌యంలో వ‌ధువు సుర‌భి పెళ్లి పీఠ‌ల‌పై కుప్ప‌కూలింది. దీంతో ఆందోళ‌న‌కు గురైన కుటుంబ స‌భ్యులు స్థానికంగా ఉండే  డాక్ట‌ర్కు స‌మాచారం అందించారు. పెళ్లి మండ‌పంలోనే వైద్య ప‌రీక్ష‌లు చేసిన డాక్ట‌ర్ .. బాధితురాలు గుండెపోటుతో మ‌ర‌ణించిన‌ట్లు నిర్ధారించారు.  

దీంతో అదే పెళ్లి మండ‌పంలో వ‌రుడికి మృతురాలు చెల్లెలు నిషాతో వివాహం జ‌రిపించారు. ‘‘ఈ ప‌రిస్థితిలో ఏం చేయాలో అర్ధం కాలేదు. నా పెద్ద చెల్లెలు సుర‌భి డెడ్ బాడీని పెళ్లిమండంలో ఉంచాం. ఇరుకుటుంబ స‌భ్యుల అంగీకారంతో నా చిన్న చెల్లెలు నిషాను మంజేష్ కి ఇచ్చి వివాహం జ‌రిపించాం. అనంత‌రం  సుర‌భి అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించాం’’ అని సురభి సోదరుడు మీడియాకి తెలిపాడు. 

చదవండి: వరుడు మిస్సింగ్‌.. వధువు షాకింగ్‌ నిర్ణయం

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు