వరుడిని పూల్‌లోకి తోసిన వధువు.. తర్వాత వాటర్‌లో ఆమె.. వీడియో వైరల్‌

6 May, 2022 12:32 IST|Sakshi

Viral Video..ప్రజెంట్‌ జనరేషన్‌లో మ్యారేజ్‌ స్టైల్‌ మారిపోయింది. పెళ్లికి ముందు ఫొటో షూట్‌ దగ్గర నుంచి పెళ్లి టైమ్‌ వరకు అంతా కొత్తగా ఉండాలని వధువరులు కోరుకుంటున్నారు. అందులో భాగంగానే ఇప‍్పటికే మనం ఫొటో షూట్స్‌ జరిగిన ఎన్నో ఫన్నీ సీన్స్‌ చూశాం. 

తాజాగా ఓ వధువు చేసిన పని.. సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్స్‌ చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. పెళ్లి కోసం ఎంతో బ్యూటిఫుల్‌గా రెడీ అయిన కపుల్స్‌ ఫొటోల కోసం క్యాట్‌ వాక్‌ చేస్తూ వస్తుండగా.. వధువు ఒక్కసారిగా వరుడిని పక్కనే స్విమ్మింగ్‌ పూల్‌లోకి తోసేస్తుంది.

A post shared by Adorable Weddings❤️ (@theadorableweddings)

ఇంతలో వరుడు కూడా ఆమెను పుల్‌లోకి లాగేస్తాడు. దీంతో నీటిలో వారిద్దరీ పూల్‌లో పడిపోతారు. అనంతరం వధువు ఎంతో ఆనందంగా వరుడిని కిస్ చేస్తూ స్మైల్‌ ఇవ‍్వడం స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది. దీంతో ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. ఓ నెటిజన్‌ స్పందిస్తూ వధువు.. వాటర్‌ ప్రూఫ్‌ మేకప్‌ వేసుకుందని ఫన్నీ కామెంట్‌ చేశాడు.

మరిన్ని వార్తలు