వైరల్‌: నల్ల కళ్లద్దాలు ధరించిన వరుడు.. ఏదేమైనా ఈ పెళ్లి నాకొద్దు!

23 Jun, 2021 11:38 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

లక్నో: అతిథులు, బంధుమిత్రులతో కళ్యాణ మండపం సందడిగా మారింది. ఓవైపు సంగీత్‌లో రెండు కుటుంబాలు కలిసి హుషారుగా స్టెప్పులేస్తున్నారు. ఇంతలోనే పెళ్లిలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. పీటల మీద పెళ్లి అనూహ్యంగా ఆగిపోయింది. పెళ్లి కొడుక్కి ఓ టెస్ట్ పెట్టి.. అందులో అతడు ఫెయిల్‌ అవ్వడంతో తనకీ పెళ్లి  వద్దని చెప్పి అతిథులందరికి షాకిచ్చింది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రంలోని ఔరయ ప్రాంతంలో చోటుచేసుకుంది. చల్దా పోలీస్ స్టేషన్ పరిధిలోని మహారాజ్ పూర్ గ్రామానికి చెందిన వినోద్ కుమాత్‌తో . జమాలిపూర్‌ గ్రామానికి చెందిన వ్యక్తి కుమార్తెకు వివాహం నిశ్చయించారు. పెళ్లిరోజున… వేదికలో అబ్బాయి నల్ల కళ్లద్దాలు పెట్టుకోవడంతో అతనిపై వదువు బంధువులకు అనుమానం వచ్చింది.

దీంతో వెంటనే వారు వరుని తరుపువారిని ప్రశ్నించారు. వారు సరైన సమాధానం చెప్పకపోవడంతో వధువు అతని కళ్లజోడు తీయించి న్యూస్‌ పేపర్‌ చదవమని అడిగింది. దీంతో వరుడు తెల్లముఖం వేశాడు. పేపర్‌ చదవలేకపోయాడు. ఇక వరుడికి కళ్లు సరిగా కనిపించవన్న నిజం గురించి ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. వెంటనే పెళ్లి ఆపేసింది. ఇదే విషయంపై ఇరువర్గాల మధ్య  రెండు రోజులు పంచాయితీ జరిగినా ఎటూ తేలలేదు. ఏదేమైనా తనకు ఆ వ్యక్తితో పెళ్లి వద్దని వధువు తెగేసి చెప్పింది. దీంతో వదువు తండ్రి వరుడు కుటుంబ సభ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

చదవండి: 
లవ్‌ ఎఫైర్‌: వరుడి చెంప చెళ్లుమనిపించిన వధువు 
వైరల్‌: వధువు నోరు, ముక్కు నుంచి పొగ!

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు