శోభనం రాత్రి వధువు ప్రశ్నకి బిత్తరపోయిన వరుడు!

31 Jul, 2021 13:01 IST|Sakshi

పెళ్లి రెండు జంటలను కలుపుతుంది. కొన్ని కుటుంబాలను బంధంతో ముడివేస్తుంది. అలా ఏర్పడిన బంధాలు జీవితంలో ఓ భాగంగా మారిపోతాయి. పండుగలకు.. వేడుకలకు ఇల్లంతా చుట్టాలతో నిండిపోతుంది. ఇలాంటి సన్నివేశాలు భారతీయ సంస్కృతిలో భాగం. అందుకే బాధ వచ్చినా.. సంతోషమైనా పంచుకునే బంధాలు, అనుబంధాలు ఉండాలి అంటారు.  

తాజాగా ఓ పెళ్లి వేడుకలో వధువు అడిగిన ప్రశ్న బంధువులను అయోమయంలో పడేసింది. ఆ తరువాత అందరినీ నవ్వులతో ముంచెత్తింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. ఓ పెళ్లి వేడుకకు చాలా మంది అతిథులు వచ్చారు. పెళ్లి వేడుక పూర్తైనది. వధూవరులను ఆశీర్వదించిన బంధవులు ఇంటికి పయనమయ్యారు. అంతా అనుకున్నట్లే జరిగింది. ఆ రాత్రికి జరగాల్సిన కార్యానికి అంతా సిద్దం చేశారు. 

మంచాన్ని వివిధ రకాల పూలతో అలంకరించారు. వరుడు మంచం మొత్తం గులాబీ రేకులతో కప్పేశాడు. అయితే శోభనం గదిలో అడుగుపెట్టిన పెళ్లి కూతురు ‘‘సోయెంగే కహా పె( మనం ఎక్కడ నిద్రపోవాలి)’’ అని అడిగిన ప్రశ్న బంధువులకు తెగ నవ్వు తెప్పించింది. దీనిపై కొందరు నెటిజన్లు స్పందిస్తూ.. ‘‘పడక గదిని పబ్లిక్‌ చేశారు’’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. మరికొందరు నవ్వుతూ ఎమోజీలతో కామెంట్‌ చేస్తున్నారు. ఇది ఎక్కడ చిత్రీకరించారో తెలియదు. కానీ ఈ వీడియోను దుల్హనియా అనే ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా.. వైరల్‌గా మారింది.

A post shared by Dulhaniyaa.com-Indian Weddings (@dulhaniyaa)

మరిన్ని వార్తలు