తెల్లారితే పెళ్లి.. ఊహించని ట్విస్టు ఇచ్చిన వధువు

26 May, 2022 08:31 IST|Sakshi

గౌరిబిదనూరు: తెల్లవారితే పెళ్లి.. కుటుంబ సభ్యులు, బంధువులతో ఇళ్లంతా కలకలలాడుతోంది. వివాహ బంధంతో కొత్త జీవితాన్ని ఊహించుకుంటున్న వరుడికి.. ఇంటి సభ్యులకు వధువు ఊహించని షాకిచ్చింది. రాత్రికి రాత్రే తన ప్రియుడితో కలిసి ఇంట్లో నుంచి పారిపోయింది.

వివరాల ప్రకారం.. బుధవారం ఉదయం 9:30 గంటలకు విదురాశ్వత్థం చన్నరాయస్వామి కల్యాణ మండపంలో వివాహం జరగాల్సి ఉండగా ఆ పెళ్లి నిలిచిపోయింది. వధువు పరారు కావడమే ఇందుకు కారణం. నగర శివారులోని నాగరెడ్డి కాలనీకి చెందిన వెన్నెల(22), కరేకల్లహళ్లివాసి సురేశ్‌కు పెళ్లి నిశ్చయమైంది. మంగళవారం రాత్రి నిబ్బళం జరిపించి అందరూ నిద్రపోయారు.

అప్పిరెడ్డిహళ్లికి చెందిన తన ప్రియుడు, మేనమామ అయిన ప్రవీణ్‌ (25)తో గుట్టుగా పరారైంది. ఉదయం చూస్తే వధువు లేకపోవడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రేమ విషయం ముందే చెప్పి ఉంటే మేనమామతోనే పెళ్లి చేసేవారమని వారిమని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పెళ్లి కొడుకు సైతం తీవ్ర నిరాశకు లోనయ్యాడు. 

ఇది కూడా చదవండి: భర్త మృతదేహంతో రెండు రోజులు ఇంట్లోనే.. 

మరిన్ని వార్తలు