పాక్‌ సరిహద్దులో బయటపడిన  సొరంగం

15 Jan, 2021 09:07 IST|Sakshi

150 మీటర్ల సొరంగం

25 నుంచి 30 మీటర్ల లోతులో ఏర్పాటు

జమ్మూ: భారత్‌–పాక్‌ అంతర్జాతీయ సరిహద్దు వద్ద పాక్‌ భూభాగంలో నుంచి భారత్‌లోకి 150 మీటర్ల పొడవున ఏర్పాటు చేసిన సొరంగాన్ని బీఎస్‌ఎఫ్‌ జవాన్లు బుధవారం ఉదయం గుర్తించారు. జమ్మూ కశ్మీర్‌లో ని హిర్నాగర్‌ సెక్టార్‌లో ఉన్న బోబి యాన్‌ గ్రామంలో ఈ సొరంగం వెలుగు చూసినట్లు బీఎస్‌ఎఫ్‌ ఐజీ ఎన్‌ఎస్‌ జంవాల్‌ చెప్పారు. ఇది అంతర్జాతీయ సరిహద్దు వెంట ఉన్న సాంబ, కతువా జిల్లాల్లో గత ఆరు నెలల్లో వెలుగు చూసిన మూడో సొరంగం కావడం గమనార్హం.

అలాగే గత పదేళ్లలో ఇది తొమ్మిదవది. తాజా సొరంగం ఉన్న చోట పాక్‌ వైపు భారీగా లాంచ్‌పాడ్లు ఉండటంతో పాటు, అది ఉగ్రవాదుల బేస్‌లు ఉన్నాయని జంవాల్‌ వెల్లడించారు. సొరంగంలో కొన్ని ఇసుక పాకెట్లు దొరికాయని, వాటిపై పాక్‌ ముద్ర ఉందని అన్నారు. రెండు నుంచి మూడు అడుగల వ్యాసం ఉన్న సొరంగం దాదాపు 25 నుంచి 30 మీటర్ల లోతులో ఉందని పేర్కొన్నారు. ఇసుక సంచులపై ఉన్న తయారీ తేదీలను బట్టి సొరంగాన్ని 2016–17 కాలంలో ఏర్పాటు  చేసిఉంటారని, దానిపై విచారణ జరుగుతోందని తెలిపారు. అయితే గత కొంత కాలంగా ఈ సొరంగం ఉన్న చోట భద్రతా బలగాలు పహారా కాస్తుండడంతో దీన్ని పెద్దగా ఉపయోగించే అవకాశాలు తక్కువగా ఉన్నాయని తెలిపారు.  

చదవండి:
లైంగిక ఆరోపణలు.. పాక్‌ కెప్టెన్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు

మరిన్ని వార్తలు