కశ్మీర్‌లో కాల్పులు, ముగ్గురు జవాన్ల వీర మరణం

8 Nov, 2020 15:46 IST|Sakshi

కశ్మీర్‌ : జమ్మూ కశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో ఆదివారం భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు భారత ఆర్మీ జవాన్లతో పాటు ఒక బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ మృతి చెందారు. ఆపరేషన్‌లో భాగంగా ఎల్‌ఓసీకి సమీపంలోని మాచిల్‌‌ సెక్టార్‌ వద్ద ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. కాగా శనివారం అర్ధరాత్రి అనుమానాస్పద కదలికలు ఉన్నట్లు గుర్తించిన పెట్రోలింగ్ బలగాలు ఆ ప్రాంతంలో నిఘాను ఏర్పాటు చేశాయి. ఇలా పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో ఉగ్రవాదులు భద్రతా బలగాలపై కాల్పులు జరిపారని ఆర్మీ అధికారులు పేర్కొన్నారు. మరోవైపు ఈ ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు