సరిహద్దుల్లో మారణాయుధాల కలకలం

24 Aug, 2022 08:02 IST|Sakshi

న్యూఢిల్లీ/జలంధర్‌: భారత్‌–పాక్‌ సరిహద్దుల్లోని పంజాబ్‌లో మంగళవారం సరిహద్దు భద్రతా దళం(బీఎస్‌ఎఫ్‌) మారణాయుధాలను స్వాదీనం చేసుకుంది. ఫిరోజ్‌పూర్‌ సెక్టార్‌లో సోమవారం ఉదయం 7 గంటల సమయంలో తనిఖీల సందర్భంగా మూడు ఏకే–47 రైఫిళ్లు, రెండు ఎం–3 సబ్‌ మెషీన్‌ గన్లు, రెండు పిస్టళ్లతోపాటు మొత్తం 10 మేగజీన్లున్న ప్యాకెట్లు ఒక పొలంలో పడి ఉండగా గుర్తించినట్లు బీఎస్‌ఎఫ్‌ తెలిపింది. వీటిని పాకిస్తాన్‌ నుంచి తెచ్చారని భావిస్తోంది. మారణాయుధాలను సకాలంలో గుర్తించి సంఘ వ్యతిరేక శక్తుల చేతుల్లో పడకుండా నివారించగలిగామని పేర్కొంది.

ఇదీ చదవండి: పాకిస్తాన్‌లోకి బ్రహ్మోస్‌ క్షిపణులు మిస్‌ఫైర్‌.. ముగ్గురు వాయుసేన అధికారులపై వేటు

మరిన్ని వార్తలు