తగ్గేదేలే.. గడ్డకట్టే చలిలో.. చెక్కుచెదరని విశ్వాసంతో..

16 Jan, 2022 14:49 IST|Sakshi

కశ్మీర్‌: బీఎస్‌ఎఫ్‌ జవాన్ల బృందం బిహు పండుగను పురష్కరించుకుని ఓ జానపద పాటకు నృత్యం చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ వీడియోను 'బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ కశ్మీర్‌' ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది. ఇందులో జవాన్లు డ్యాన్స్‌ చేస్తున్న తీరు వారి అచంచలమైన స్ఫూర్తిని, కఠినమైన వాతావరణ పరిస్థితులలో కూడా చెక్కుచెదరని విశ్వాసాన్ని గుర్తుచేస్తుంది. 

ఈ వీడియోలో జనవరి, ఫిబ్రవరిలో.. అస్సాం, ఈశాన్య భారతదేశంలో జరుపుకునే పంట పండుగ అయిన బిహును పురష్కరించుకుని సైనికదళాలు నృత్యం చేయడం మన గమనించవచ్చు. కశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో కెరాన్‌ సెక్టార్‌లో చిత్రీకరించిన ఈ వీడియోలో.. ఆర్మీ జవాన్లు మైనస్‌ 15 డిగ్రీల సెల్సియస్‌ గడ్డకట్టే ఉష్ణోగ్రత వద్ద ఉత్సాహంగా నృత్యం చేయడం చూడవచ్చు.

చదవండి: (తాతా నీళ్లు తాగు.. గంగిరెద్దు ఇదిగో అరటిపండు! సల్లగుండు బిడ్డా)

'పర్వతాలు, మంచు, మంచు తుఫానులు, గడ్డకట్టే ఉష్ణోగ్రతలు, 24 గంటలపాటు తీవ్ర ఒత్తిడి, ఎల్‌ఓసీ, ఇళ్లకు దూరంగా ఉండటం ఇవి ఏవీ కూడా వారిని నిరుత్సాహానికి గురిచేయలేదు.. పండుగ జరుపుకోవడాన్ని అడ్డుకోలేదు' అంటూ క్యాప్షన్‌ ఇస్తూ 'బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ కశ్మీర్‌' వీడియో పోస్ట్‌ చేసింది. 

మరిన్ని వార్తలు