బడ్జెట్‌ 2021: మందుబాబులకు షాక్..!

1 Feb, 2021 15:46 IST|Sakshi

ఆల్కహాలిక్‌ ఉత్పత్తులపై 100శాతం సెస్‌ విధింపు

సాక్షి, న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ప్రతి ఒక్కరిని  కలవరపెడుతున్న అంశం సెస్‌. ఇక మీదట క్రూడ్‌ ఆయిల్‌, ఆల్కహాల్‌, ముడి ఆయిల్‌, కొన్ని దిగుమతి చేసుకునే వస్తువులపై వ్యవసాయ, మౌలికసదుపాయల అభివృద్ధి సెస్‌ని విధించేందుకు కేంద్రం సిద్ధమయ్యింది. ఈ నేపథ్యంలో ఆల్కాహాల్‌, క్రూడ్‌ ఆయిల్‌, పామయిల్‌, వంట నూనెల ధరలు భారీగా పెరగనున్నాయి. ఆల్కాహాల్‌ బివరేజేస్‌పై కేంద్రం 100 శాతం సెస్‌ని ప్రతిపాదించింది. దాంతో మందు బాబుల కళ్లు బైర్లు కమ్మెలా మద్యం ధరలు మరింత పెరగనున్నాయి. ముడి పామాయిల్‌పై 17.5 శాతం, దిగుమతి చేసుకున్న యాపిల్స్‌పై 35 శాతం, ముడి సోయాబీన్‌, సన్‌ ఫ్లవర్‌ నూనెలపై 20శాతం వ్యవసాయ సెస్‌ని బడ్జెట్లో ప్రతిపాదించిన సంగతి తెలిసిందే.
(చదవండి: ఇంధన ధరల మంట.. నిర్మల వివరణ)

ఫలితంగా వంట నూనెలు ధరలు మరింత పెరగనున్నాయి. ఇప్పటికే వంట నూనెలు లీటర్‌ 140 రూపాయలుగా ఉండగా.. వ్యవసాయ సెస్‌ అమల్లోకి వస్తే.. ఇది మరింత పెరగనుంది. ఇక పెట్రోల్‌, డీజిల్‌పై విధించిన వ్యవసాయ సెస్‌ని సుంకం నుంచి మినహాయిస్తామని.. ఫలితంగా వాటి ధరలు యథాతధంగా ఉంటాయిన నిర్మలా సీతారామన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. 
 

>
మరిన్ని వార్తలు