బడ్జెట్‌ 2021: మరింత మండిపోనున్న ఇంధనం

1 Feb, 2021 13:34 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: వరుసగా మూడో సారి బడ్జెట్‌ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్‌ సగటు వేతన జీవిని నిరాశ పరిచారు. రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ కొటేషన్‌ ‘‘విశ్వాసం పక్షిలాంటిది. తెల్లవారుజామున ఇంకా చీకటిగా ఉన్న సమయంలో కూడా అది వెలుతురును అనుభవిస్తూ.. పాడుతుంది’’ అంటూ బడ్జెట్‌ ప్రసంగాన్ని ప్రారంభించారు. దాదాపు గంట 51 నిమిషాలు సాగిన నిర్మల బడ్జెట్‌ ప్రసంగంలో ఆదాయ పన్నులపై ఎలాంటి క్లారీటీ ఇవ్వలేదు. దాంతో పాత శ్లాబులే కొనసాగుతాయని భావిస్తున్నారు. ఇక ఈ ఏడాది బడ్జెట్‌లో ఆరోగ్యానికి, మౌలిక సదుపాయల అభివృద్ధికి, రైల్వేలకు, వ్యవసాయనికి పెద్ద పీట వేశారు. 

పెట్రో బాదుడు..
ఇప్పటికే పెట్రోల్‌, డీజిల్‌ ధరలతో సామాన్యులు బెంబెలేత్తుతుండగా.. బడ్జెట్‌ తర్వాత వాటి ధరలు మరింత పెరగనున్నాయి. తాజాగా లీటర్‌ పెట్రోల్‌పై 2.50 రూపాయలు, డీజిల్‌పై 4 రూపాయల వ్యవసాయ సెస్సు విధించనున్నారు. దాంతో పెట్రో మంట ఇప్పట్లో చల్లారే సూచనలు కనిపించడం లేదు.
 

Poll
Loading...
మరిన్ని వార్తలు