బడ్జెట్‌ 2021: ధరలు పెరిగేవి.. తగ్గేవి ఇవే!

1 Feb, 2021 21:34 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సోమవారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో కాటన్‌పై 10శాతం కస్టమ్స్‌ డ్యూటీ పెంపుతో దిగుమతి చేసుకునే ప్రీమియం దుస్తులు మరింత ప్రియం కానున్నాయి. అదే విధంగా లెదర్‌ ఉత్పత్తులు, సోలార్‌ ఇన్వెర్టర్ల ధరలు పెరగనున్నాయి. ఆటోమొబైల్‌ రంగంలో కస్టమ్‌ డ్యూటీ పెంపుతో కార్ల విడిభాగాల ధరలు కూడా పెరగనున్నాయి. ఇక బంగారం, వెండి ధరలు మాత్రం దిగిరానున్నాయి. అదే విధంగా రాగిపై పన్ను మినహాయింపులు ఇస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. కాగా అక్టోబర్‌ 21 నుంచి కొత్త కస్టమ్స్‌ పాలసీ అమల్లోకి రానుంది.(చదవండి: ముగిసిన బడ్జెట్‌ ప్రసంగం: లోక్‌సభ రేపటికి వాయిదా)

ధరలు పెరిగేవి
ఎలక్ట్రానిక్‌ వస్తువులు
మొబైల్‌ ఫోన్లు(ఇంపోర్టు డ్యూటీ 2.5 పెంపు)
చెప్పులు
పర్సులు
చార్జర్స్‌(మొబైల్‌ విడిభాగాల్లో కొన్నింటికి మినహాయింపు)
సింథటిక్‌ జెమ్‌స్టోన్స్‌
లెదర్‌ ఉత్పత్తులు
సోలార్‌ ఇన్వర్టర్లు(డ్యూటీ 5 శాతం నుంచి 20 శాతానికి పెంపు)
సోలార్‌ లాంతర్లు(5 నుంచి 15 శాతానికి పెంపు)
ఆటో విడిభాగాలు
స్టీలు స్క్రూలు(10 నుంచి 15 శాతానికి పెంపు)
కాటన్‌(0 నుంచి 10 శాతం)
రా సిల్స్‌, యాన్‌ సిల్క్‌(10 నుంచి 15 శాతానికి పెంపు)
ఆల్కహాలిక్‌ బీవెరేజెస్‌
క్రూడ్‌ పామాయిల్‌
క్రూడ​ సోయాబీన్‌, సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌
ఆపిల్స్‌
బొగ్గు, లిగ్నైట్‌, పిట్‌
యూరియా తదితర ఫర్టిలైజర్లు
బఠాణీలు
కాబూలీ శనగలు
బెంగాల్‌ గ్రాం
పప్పులు

ధరలు తగ్గేవి

ఐరన్‌
స్టీలు
నైలాన్‌ దుస్తులు, నైలాన్‌ ఫైబర్‌
కాపర్‌ వస్తువులు
ఇన్సూరెన్స్‌
షూస్‌
బంగారం, వెండి ధరలు
నాప్తా(హైడ్రోకార్బన్‌ లిక్విడ్‌ మిక్చర్‌)

మరిన్ని వార్తలు