Parliament Budget Session Live Updates: పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు.. లైవ్‌ అప్‌డేట్స్‌

1 Feb, 2023 07:47 IST|Sakshi

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు లైవ్‌ అప్‌డేట్స్‌
► ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2023 ఆర్థిక సర్వేను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు.

► ఈ బడ్జెట్ సమావేశాల్లో చైనాతో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, సరిహద్దు వివాదాల సమస్యలను లేవనెత్తుతాం.. కన్యాకుమారి నుంచి కాశ్మీర్‌ వరకు పాదయాత్ర చేసిన నాయకుడిని (రాహుల్‌గాంధీ) అభినందించడానికి బదులు, వారు (కేంద్రం) తిట్టడమే పనిగా పెట్టుకున్నారు: కాంగ్రెస్‌ అధినేత మల్లికార్జున్‌ ఖర్గే

► ఈ ఏడాది జీ20 సదస్సు అధ్యక్ష పదవిని భారత్‌ చేపట్టింది. G20లోని అన్ని సభ్య దేశాలతో పాటు, ప్రపంచ సమస్యలకు పరిష్కారాలను కనుగొనడం ఇప్పుడు మన దేశం ముందున్న లక్ష్యం: పార్లమెంటులో రాష్ట్రపతి ముర్ము

► మహిళా సాధికారతకు ఇప్పుడున్న ప్రభుత్వం ఎన్నో ప్రోత్సాహకారాలు అందిస్తోంది. ఇప్పుడున్న ధైర్యవంతమైన, నిర్ణయాత్మకమైన ప్రభుత్వం. అందుకే తొమ్మిదేళ్ల పాలనలో ప్రజలకు నమ్మకం పెరిగింది: రాష్ట్రపతి ముర్ము

రాబోయే పాతికేళ్లు దేశానికి ఎంతో కీలకం: రాష్ట్రపతి

దేశ ప్రగతిలో యువశక్తి, నారీశక్తి భాగస్వామ్యం కావాలి. పేదరికం లేని భారత్‌ నిర్మాణం జరగాలి. రాబోయే పాతికేళ్లు దేశానికి ఎంతో కీలకం. ఆత్మనిర్భర్‌ భారత్‌ను నిర్మించుకుందాం అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన తొలి ప్రసంగంలో పేర్కొన్నారు. 

► పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. సోమవారం ఉదయం పదకొండు గంటల సమయంలో రాష్ట్రపతి భవన్‌ నుంచి పార్లమెంట్‌కు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..  తన ప్రసంగంతో పార్లమెంట్‌ సెషన్స్‌ను ప్రారంభించారు. 

ప్రపంచమంతా మన బడ్జెట్‌ కోసం చూస్తోంది: ప్రధాని మోదీ

► గతంలో కొత్తగా ఎవరైనా ఎంపీ ఎన్నికైతే.. మంచి వాతావరణంలో వాళ్లను మాట్లాడేందుకు అనుమతించి.. వాళ్లలో ఆత్మవిశ్వాసం నింపడం ఒక ఆనవాయితీగా వస్తోంది. కానీ, ఇప్పుడు రాష్ట్రపతి అలా ప్రసంగించబోతున్నారు. ఇది గిరిజనులకు ఎంతో గర్వకారణమైన రోజు అని ప్రధాని మోదీ తెలిపారు. అలాగే.. మన ఆర్థిక మంత్రి కూడా మహిళే ఉన్నారని, ఈ సారి బడ్జెట్‌కోసం ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోందని ప్రధాని తెలిపారు. ప్రతీ పౌరుడిని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్‌ రూపకల్పన జరిగిందన్న ప్రధాని.. అంచనాలను అందుకునే యత్నిస్తామని తెలిపారు.

► పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల ప్రారంభానికి ముందు దేశ ప్రధాని నరేంద్ర మోదీ మీడియా ద్వారా మాట్లాడారు. ప్రస్తుతం ప్రపంచమంతా భారత్‌ ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌ కోసం ఎదురు చూస్తోందని, ప్రపంచంలో నెలకొన్న అనిశ్చితి అందుకు కారణమని ఆయన అన్నారు. 

► బీఆర్‌ఎస్‌, ఆప్‌ ఎంపీలు రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించగా.. కొందరు కాంగ్రెస్‌ ఎంపీలు భారత్‌ జోడో యాత్ర ముగింపులో పాల్గొని శ్రీనగర్‌లో మంచు కారణంగా చిక్కుకుని హాజరు కాలేకపోయారు.

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు