ఉపఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం

5 Nov, 2022 12:36 IST|Sakshi

న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న ఐదు అసెంబ్లీ, ఒక ఎంపీ స్థానానికి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. యూపీ, ఒడిశా, రాజస్తాన్‌, బిహార్‌, ఛత్తీస్‌ఘడ్‌లో ఉప ఎన్నికలు జరగనున్నాయి. ములాయం సింగ్‌ మరణంతో మెయిన్‌పురీ ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. నవంబర్‌ 10 నుంచి 17వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. డిసెంబర్‌ 5న పోలింగ్‌ నిర్వహించి, 8న కౌంటింగ్‌ ఫలితాలను ప్రకటిస్తారు.  

చదవండి: (117 ఏళ్ల దేశ తొలి ఓట‌రు ఇక లేరు.. బ్యాలెట్ ద్వారా ఓటు వేసిన 3 రోజులకే..)

మరిన్ని వార్తలు