పండుగ బొనాంజా : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బోనస్‌

21 Oct, 2020 15:59 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బోనస్‌ను అందించేందుకు కేంద్ర కేబినెట్‌ బుధవారం ఆమోదముద్ర వేసింది. బోనస్‌ను అందించేందుకు తక్షణం రూ 3737 కోట్లను విడుదల చేసేందుకు నిర్ణయించింది. కేబినెట్‌ నిర్ణయంతో 30 లక్షలకు పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బోనస్‌ జారీతో పండుగ సీజన్‌లో డిమాండ్‌ పుంజుకుంటుందని ప్రభుత్వం భావిస్తోంది.

దసరా లోపు బోనస్‌ ఉద్యోగుల ఖాతాల్లో ఒకే వాయిదాలో జమవుతుందని ఈ నిర్ణయం ప్రకటిస్తూ కేంద్ర మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ వెల్లడించారు. ప్రభుత్వ నిర్ణయంతో రైల్వేలు, పోస్ట్‌ ఆఫీసులు, ఈపీఎఫ్‌ఓ, ఈఎస్‌ఐసీ వంటి ప్రభుత్వ రంగ సంస్ధల్లో పనిచేసే 17 లక్షల మంది నాన్‌ గెజిటెట్‌ ఉద్యోగులతో పాటు, మరో 13 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉత్పాదకతతో సంబంధంలేని బోనస్‌ను అందుకోనున్నారు. మరోవైపు దుర్గా పూజ లోగా సామర్ధ్యం ఆధారిత బోనస్‌ను విడుదల చేయనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని రెండు ప్రధాన రైల్వే ఉద్యోగ, కార్మిక సంఘాలు హెచ్చరించాయి. చదవండి : ఉద్యోగులకు 6 నెలల జీతం బోనస్‌

మరిన్ని వార్తలు