కేంద్రం తీపికబురు.. సమగ్ర శిక్షా పథకం 2026 వరకు పొడిగింపు..

4 Aug, 2021 16:50 IST|Sakshi
కేం‍ద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌

న్యూఢిల్లీ: సమగ్ర శిక్షా పథకాన్ని 2026 వరకు పొడిగించినట్టు కేం‍ద్రం విద్యాశాఖ మంత్రి ధర్మేం‍ద్ర ప్రధాన్‌ బుధవారం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన విద్య, నైపుణ్యం అందించడంపైనే తమ దృష్టి ఉంటుందని అన్నారు. అదే విధంగా, సమగ్ర శిక్షా పథకానికి గాను.. రూ.1,85,398 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇకనుంచి  ప్రభుత్వ పాఠశాలలో ప్లేస్లూల్స్‌ కూడా ఉండాలని కేం‍ద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తెలిపారు.

డీబీటీ ద్వారా నేరుగా విద్యార్థులకు ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కాగా, 2023 వరకు ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టుల కేం‍ద్ర ప్రాయోజిత పథకాన్ని పొడిగించామని పేర్కొన్నారు. అదే విధంగా.. 1023 ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులను మరో రెండేళ్లు పొడిగిస్తున్నట్లు తెలిపారు. భారత్‌లో లైంగిక పరమైన నేరాలలో సత్వర న్యాయం అందించడం కోసం ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులను ఏర్పాటు చేశామని అన్నారు. కాగా, నిర్భయ నిధి నుంచి నిధులను అందిస్తున్నట్లు కేం‍ద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు